Friday, October 7, 2022
Friday, October 7, 2022

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం

విశాలాంధ్ర – గిద్దలూరు : గిద్దలూరు మండలం గిద్దలూరు లోని కుమ్మరాం కట్ట సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 105 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. మినీ లారీలో రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న విషయాన్ని స్థానికులు గుర్తించారు. ఈ సమాచారాన్ని పోలీసులకు అందించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అక్రమంగా తరలిస్తున్న బియ్యంతో పాటు మినీ లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తులు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపు పై విచారిస్తున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రేషన్ బియ్యం స్వాధీన పరచుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img