Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

గుండ్లకమ్మ గేట్లు మరమ్మత్తులు వెంటనే చేయాలి–వడ్డె హనుమారెడ్డి

విశాలాంధ్ర నాగులుప్పలపాడు:- గుండ్లకమ్మ గేట్లు మరమ్మత్తుల పనులను వెంటనే పూర్తి చేయాలని గుండ్లకమ్మ ఆయకట్టు రైతు సంఘం కార్యదర్శి వడ్డె హనుమారెడ్డి డిమాండ్ చేశారు . గుండ్లకమ్మ గేట్లు మరమ్మత్తు వెంటనే చేయాలని నాగులప్పలపాడు మండల తాసిల్దార్ కార్యాలయం ఎదురు గుండ్లకమ్మ ఆయకట్టు రైతు సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. మండల తాసిల్దార్ సృజన కుమార్ కు మండల రైతు సంఘం నాయకులు సోమవారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా హనుమారెడ్డి మాట్లాడుతూ గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మాణానికి 647 కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు చేసి నిర్మించిన ప్రాజెక్ట్ నిర్వహణ లోపం కారణంగా మూడవ నెంబర్ గేట్ కొట్టక పోయి సాగుకు ఉపయోగపడవలసిన నీరు సముద్రం పాలు అయిందని అన్నారు. మరికొన్ని గేట్లు మరమ్మతు చేయాల్సిన అవసరం ఉందని దీనికోసం సుమారు 10 కోట్ల రూపాయలు అవసరం ఉందన్నారు అలాగే కాలువ కొరవ పనులకు రూ 24 కోట్లు, నిర్వహితుల సమస్యల పరిష్కారానికి రూ 40 కోట్లు ఇతర నిర్వహణ ఖర్చులతో కలిపి సుమారు రూ 100 కోట్లు అవసరమని ఇంజనీరింగ్ అధికారులు ప్రభుత్వానికి అంచనాలు పంపించినప్పటికీ బడ్జెట్లో కేవలం 30 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అయితే రెండు కోట్ల నిధులు విడుదల కూడా చేయకపోవడం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనడానికి నిదర్శనం అని అన్నారు. కావున గుండ్లకమ్మ గేటు మరమ్మత్తులు పనులు వెంటనే పూర్తి చెసి నీటిపారుదల కు ఆటంకంగా కాలువలో పెరిగిన తూటు జమ్ము చిర్ల చెట్లను తొలగించాలన్నారు. అలాగే కాలువలు కొరవ పనులను పూర్తి చేసి పంట భూములకు వెంటనే నీరు అందించారు అన్నారు. గుండ్లకమ్మ పరిధి రైతులను పూర్తిగా ఆదుకోవాలని కోరారు. మాచవరం, నాగులుప్పలపాడు, చేకూరపాడు, అమ్మనబ్రోలు, పోతవరం, ప్రసంగలపాడు తదితర గ్రామాల రైతులు గిట్టుబాటు ధర లేక సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చెరుకూరి వాసు సిహెచ్ ఆంజనేయులు పోకూరి వెంకటేశ్వర్లు కే నాగార్జున రాచపూడి ఆంజనేయులు, 100 మంది రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img