Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

అద్దంకి సాల్మన్ కేరీ వెస్లీ ఘన నివాలి

విశాలాంధ్ర – ఒంగోలు : మాజీ దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రధాన భద్రత అధికారిగా విధులు నిర్వహిస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన అద్దంకి సాల్మన్ కేరీ వెస్లీ 13 వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక గర్గ్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) నాగేశ్వరరావు జిల్లా పోలీస్ కార్యాలయంలో వారి చిత్రపటానికి మరియు ఒంగోలు చర్చి సెంటర్ వద్ద సాల్మన్ విగ్రహానికి అడిషనల్ ఎస్పీ మరియు పోలీస్ అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ సాల్మన్ పోలీస్ శాఖ యొక్క గౌవరం ఇనుమడింపజేసే విధంగా విధులు నిర్వహించారని, వీరు ప్రకాశం జిల్లాకు చెందిన వారై ఉండటం గర్వించదగిన విషయమని కొనియాడారు. వారి కుటుంబసభ్యులకు పోలీస్ శాఖ తరఫున అన్ని విధములుగా అండగా ఉంటామని అడిషనల్ ఎస్పీ తెలియచేసినారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు,డి ఎస్ బి డి.ఎస్.పి బి.మరియదాసు , ఒంగోలు డిఎస్పీ యు.నాగరాజు , ట్రాఫిక్ డిఎస్పీ మల్లికార్జున రావు , డిపిఓ , ఏవోయం.సులోచన గారు, ఆర్ఐలు శ్రీహరి రెడ్డి, హరిబాబు ఎస్.కె మౌలిధిన్ ఎస్సైలు, డిపిఓ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img