విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆవలం భిస్తున్న ప్రజావ్యతిరేక విదానాలను వ్యతిరేకిస్తూ సిపియం ఆద్వర్యంలో తలపెట్టిన సమరభేరి ప్రచారజాత శనివారం నాగులుప్పలపాడు మండలం చేరింది ఈసందర్బంగా సిపియం రాష్ట్రనాయకులు జాలాఅంజయ్య, తో పాటు జిల్లానాయకులు మాట్లాడుతూ అధికధరలు నిరుద్యోగం విద్యుత్ చార్జీల భారంతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారన్నారు మతోన్నాద మోఢీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో విపలమైందన్నారు ధరలను అదుపుచేయడంలో గోరంగా విఫలమైంది కార్పోరేట్ కంపెనీలకు లక్షలకోట్లు రాయితీలు కల్పిస్తూ సామాన్యుల నడ్డివిరుస్తుందన్నారు మోఢీకి భజన చేస్తున్న రాష్ట్రప్రభుత్వం సంస్కరణల పేరుతో విద్యుత్ చార్జీలు ఈపాటికే 7సార్లు పెంచి ప్రజలపై భారాలు మోపుతుందన్నారు నిత్యావసర ధరలు ఆకాశాన్నంటున్నాయన్నారు మోఢీ గద్టెనెక్కిన నాడు గ్యాస్ ధర 450ఉండగా పస్తతం 1200కు పెంచారన్నారు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక అప్పుల పాలై ఆత్మహత్యల చేసుకుంటున్నారని విమర్శించారు మోఢీ అధికారంలోకి వస్తే ఏడాదికీ 2కోట్లుఉద్యోగాలు ఇస్తామని నల్లధనం వెలికి తీసి ప్రతి కుటుంబానికి 15లక్షలు పంపిణీ చేస్తామని చెప్పి ఆచరణలో నోచుకోలేదన్నారు రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామని విద్యుత్ చార్జీలు పెంచబోమని హమీఇచ్చీ తుంగలో తొక్కీ 7సార్లు విద్యుత్ చార్జులు పెంచారని విమర్శించారు కేంద్రం చెప్పిన విద్యుత్ చట్టానికి ఆమోదం తెలిపి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలుచేసిన వ్యవసాయానికి ఇచ్చిన ఉచిత విద్యుత్ ను మీటర్లపేరుతో రైతులకు ఉచిత విద్యుత్ దూరం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు కోట్లాది రూపాయలతో నిర్మించిన గుండ్లకమ్మ రామతీర్థం రిజర్వాయరు గేట్లు దెబ్బతిన్న మరమ్మతులకు నోచుకోలేదన్నారు అదేవిదంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు నుండి 80వేల ఏకరాలకు సాగునురు అందించవలసి ఉండగా పిల్లకాలువలు పూర్తికాక ఒక్క ఎకరానికి నీరుఅందనిపరిస్దితి నెలకొందన్నారు ఈనేపద్యంలో రైతాంగం ఆయిల్ ఇంజన్లద్వార నీరుపెట్టుకోవాల్సిన పరిస్దితి నెలకొందన్నారు దేశంలో మతోన్మాదం అధికధరలు పెంచుతూ దేశాన్ని నాశనం చేస్తున్న బిజెపికి భజనచేస్తున్న అధికారపార్టి వైసిపిప్రభుత్వం ప్రతిపక్షం తెలుగుదేశం జనసేన పార్టీలకు రానున్న ఎన్నీకల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు తదితర సమస్యలపై చర్చించేందుకు ఆదివారం మండలకేంద్రమైన నాగులుప్పలపాడులో సమరభేరి సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈసభకు సిపియం రాష్ట్రకార్యదర్శి వి శ్రీనివాహసరావు,తో జిల్లా రాష్ట్ర నాయకులు పాల్గొంటున్నారు ఈసభలో ప్రతి ఓక్కరు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు, తొలుత సమరభేరి జాతా మండలంలో నిడమానూరు,పోతవరం, కండ్లగుంట, ఒమ్మెవరం, ఉప్పుగుండూరు, మాచవరం, రాపర్ల, అమ్మనబ్రోలు, చీర్వానుప్పలపాడు, చదలవాడ, నాగులుప్పలపాడు, తదితరగ్రామాల్లో పర్యటించింది ఈకార్యక్రమంలో సిపియం నాయకులు కాలం సుబ్బారావుయు ఆదిలక్ష్మి, బి రఘరామ్ , ఎన్ వెంకటేశ్వర్లు, టి శ్రీకాంత్ ,జి బసవపున్నయ్య, యు వెంకటేశ్వర్లు, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.