Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పంచాయతీ కార్యాలయానికి తాళం వేసిన సర్పంచ్

కొత్తగా మంజూరైన పెన్షన్ దారుల నుండి 300 రూపాయలు వసూలు చేసి ఇవ్వాలని పంచాయతీ అధికారి కి డిమాండ్

విశాలాంధ్ర – మార్టూరు:- మండలంలోని ద్రోణాదుల గ్రామ పంచాయతీ కార్యాలయానికి గ్రామ సర్పంచ్ వంకాయలపాటి భాగ్య రావు బుధవారం తాళం వేసిన సంఘటన గ్రామం లో కలకలం రేపింది. పంచాయితీ సచివాలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నూతనంగా 80 మంది పెన్షన్ మంజూరు అవగా మంగళవారం సాయంత్రం సచివాలయ సిబ్బంది, వాలెంటర్ల్లు పంచాయతీ కార్యదర్శి రాకేశ్ పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సర్పంచ్ భాగ్య రావునూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులు ఒక్కొక్కరి నుండి 300 రూపాయలు వసూలు చేసి తనకు కి ఇవ్వాలని అధికారులకు ఆదేశించినట్లు ఉద్యోగులు తెలిపారు లబ్ధిదారుల నుండి 300 రూపాయలు వసూళ్లకు వ్యతిరేకమని ఉన్నతాధికారులకు తెలిస్తే మా ఉద్యోగాలు పోతాయని సర్పంచ్ కు చెప్పి లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. దీంతో ఆగ్రహించిన సర్పంచ్ భాగ్య రావు బుధవారం ఉదయం పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి విధుల కోసం వచ్చిన పంచాయతీ కార్యదర్శి రాకేష్ కు తనకు సహకరించని కార్యదర్శి అవసరం లేదని కొత్త కార్యదర్శి నిర్మించుకుంటాం అని నీవు ఆఫీసుకు రావద్దని న రాకేష్ తో చెప్పాడు మధ్యాహ్నం వరకు సచివాలయంలో గడిపిన కార్యదర్శి ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డిని కలిసి జరిగిన విషయం వివరించారు. అధికారుల ఆదేశాల మేరకు సర్పంచ్ భాగ్య రావు సాయంత్రం కార్యాలయం కు తాళం తీయించడం గమనార్హం.

సచివాలయం లో కూర్చున్న ద్రోణాదుల పంచాయతీ కార్యదర్శి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img