Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, మేయర్ గంగాడ ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ చేసిన డీఎస్పీలు

విశాలాంధ్ర – ఒంగోలు : ఎస్సీ కార్పొరేషన్ ఉద్యోగులు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పై మరియు ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత తెలుగుదేశం కార్పొరేటర్ తిప్పిరిపల్లి రవితేజ పై పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసుల్లో ఇరువురు డిఎస్పీలు శుక్రవారం విచారణ చేపట్టారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్రీనివాస్ విశ్వనాథ్ తమ జీతం డబ్బులు అడిగినందుకు తమను కులం పేరుతో దూషిస్తూ అవమానపరిచే అస్పృశ్యత పాటించారని ఎస్సీ ఉద్యోగులు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పై జిల్లా కలెక్టర్ మరియు సాంఘిక సంక్షేమ మంత్రి నాగార్జున తదితరులకు ఫిర్యాదు చేసిన స్పందన లేకపోవడంతో దళిత నేత నీ లం నాగేంద్రరావు ఆధ్వర్యంలో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు ఒంగోలు డిఎస్పి నాగరాజు నాలుగు రోజుల క్రితం ప్రగతి భవనం వద్ద ఎస్సీ కార్పొరేషన్ ఈడీపై కేసు పెట్టిన కొమ్ము గోపాల్ రావు మరియు దారా వెంకటముల నుండి సాక్షాలను రికార్డు చేసుకున్నారు . తదుపరి విచారణలో భాగంగా శుక్రవారం పై కేసులోని బాధితులైన ఉసురుపాటి శ్రీనివాసరావు తెల్ల విజయబాబు డ్రైవర్ కొప్పోలు పిచ్చయ్యల నుండి సాక్ష్యాలను వీడియో రికార్డు చేసుకున్నారు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తూ తిక శ్రీనివాస్ విశ్వనాథ్ తమను కులపరంగా అవమానిస్తు వేధిస్తున్నన్డని ఎస్సీ ఉద్యోగులు పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసులో ఫిర్యాదుదారుడైన కొమ్ము గోపాలరావు తో సహా ఐదుగురు ఉద్యోగులు ఈడి విశ్వనాధ్ కి వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పారు. మరో ముగ్గురు ఎస్సీ కార్పొరేషన్ ఉద్యోగులు సాక్ష్యాలు చెప్పవలసి ఉంది. అలాగే కుల సంఘాలకు చెందిన మరో ఏడుగురు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ విశ్వనాధ్ పై కీలకమైన సాక్ష్యం చెప్పవలసి ఉంది. త్వరలోనే మిగతా బాధితులను, సాక్షులను విచారించి ఈ కేసులో తగిన చర్యలు తీసుకుంటామని ఒంగోలు డి.ఎస్.పి నాగరాజు మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు దారా. అంజయ్యకు తెలిపారు . ఒంగోలునగర మేయర్ గంగాడ సుజాత తెలుగుదేశం కార్పోరేటర్ పిత్తిరిపల్లి. రవితేజ పై పెట్టిన ఎస్సీ ఎస్టీ కేసులో ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పి రామకృష్ణ మున్సిపల్ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్ లో శుక్రవారం విచారణ చేపట్టారు . ఈనెల 1వ తేదీన ఒంగోలు నగర 26వ డివిజన్ తెలుగుదేశం కార్పోరేటర్ తిప్పర మళ్లీ. రవితేజ తనపై మీడియాలో కుల పరంగా అవమానిస్తూ తాను ఎస్సీ కాదని బిసి కులానికి చెందిన దానిని అవమానపరుస్తూ చేసిన వ్యాఖ్యలపై ఒంగోలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఈ ఘటన క్రైమ్ నెంబర్ 251/22 ఎస్సీ ఎస్టీ కేసుగా తెలుగుదేశం కార్పొరేటర్ రవితేజ పై కేసు నమోదు అయింది తాను ఎస్సీ కులానికి చెందిన దానినని తాను ఎస్సీ రిజర్వేషన్లు ఈ జిల్లాలోని టీచర్గా ఉద్యోగం చేశానని కొండేపి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుండి పోటీ చేశానని ప్రస్తుతం ఒంగోలు ఎస్సీ రిజర్వేషన్ కోటాలో మహిళా మేయర్ గా సంవత్సరం నుండి చేస్తున్నానన్నారు. పుట్టుకతో ఎస్సి కులానికి చెందిన తనను ఒంగోలు నగర ప్రథమ పౌరురాలు నైనా నన్ను అవమానించాలని ఉద్దేశంతో తన పుట్టుక కులం గురించి పదే పదే మీడియా పరంగా కుల దురంకార విమర్శలు చేస్తున్న గృహంకార విమర్శలు చేస్తున్న రవితేజ వ్యాఖ్యలపై మేయర్ గంగాడ సుజాత ఎస్ సి ఎస్ టి డి ఎస్ పి రామకృష్ణకు వీడియో స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే తెలుగుదేశం కార్పోరేటర్ రవితేజ మీడియా పరంగా చేసిన వీడియో రికార్డును కూడా ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పి కి అప్పగించారు అదేవిధంగా మున్సిపాలిటీలోని టీ కొట్టు వద్ద తన గురించి తన కులం గురించి హేళనగా, అసభ్యంగా, పరువు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా వ్యవహరించిన తెలుగుదేశం కార్పోరేటర్ ని అరెస్టు చేయాలని ఈ సందర్భంగా ఒంగోలు మేయర్ గంగాధర్ సుజాత ఎస్సీ ఎస్టీ సెల్ డి.ఎస్.పి నీ రామకృష్ణను కోరారు. ఒంగోలు దళిత మేయర్ గంగాడ సుజాతను కులం పేరుతో దూషించి అవమానించి బెదిరించిన కేసులో వెంకట సుబ్బారావు గుప్తాను అరెస్టు చేసి జైలుకు పంపించినట్లే తెలుగుదేశం కార్పోరేటర్ రవితేజను కూడా అరెస్టు చేసి జైలుకు పంపించాలని మాల మహాసభ జిల్లా కన్వీనర్ తానికొండ ఆనంద్ ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పి రామకృష్ణకు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img