ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి
విశాలాంధ్ర -వలేటివారిపాలెం : మండలం లోని శ్రీ మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానంకు వచ్చు భక్తులకుపరిశుభ్రతతో కూడిన నాణ్యమైన,రుచికరమైన భోజనం వడ్డించాలని కందుకూరు శాసన సభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి అన్నారు.శనివారం మాల్యాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం సందర్శించి పూజలు నిర్వహించి ఆలయ పరిసరాలను నిశితంగా పరిశీలించారు.అన్నదాన కార్యక్రమాన్ని దగ్గర ఉండి పరిశీలించి పర్యవేక్షించారు.భోజనం నాణ్యతలో రాజీ పడవద్దని అధికారులకు సూచించారు.భక్తులను స్వామి అని పిలవాలని సిబ్బందికి తెలియజేసారు.అనంతరం లడ్డు కౌంటర్, కేసకండనశాల,గోశాలను పరిశీలించారు అనంతరం ఆలయంలోని పరిసరాలను పరిశీలించి అధికారులకు పలుచూచనలు చేశారు. విషయం ఏమిటంటే ఎమ్యెల్యే గా కాకుండా సామాన్య భక్తుడిలా ఉదయం 7.30గంటలనుండి సాయంత్రం 5.00గంటల వరకు అన్నదానం కార్యక్రమంలో పాల్గొని సేవలందించారు ఈ కార్యక్రమంలో ఆలయకార్యనిర్వాహణాధికారి కె బి శ్రీనివాసరావునాయకులు పరిటాల వీరాస్వామి,అనుమోలు వెంకటేశ్వర్లు,ఇంటూరి హరిబాబు,యాళ్ల శివకుమార్ రెడ్డి,అనుమోలు వెంకటస్వామి ఆలయ సిబ్బంది శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు,నారాయణ,రాజు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.