Saturday, August 13, 2022
Saturday, August 13, 2022

స్వాతంత్ర్య సమర యోధుల విగ్రహాలను
ఆధునీకరిం చండి

విశాలాంధ్ర – ఒంగోలు : ఆజాదీ కా అమృత మహోత్సవం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
సందర్భంగా ప్రభుత్వం తలపెట్టిన అనేక కార్యక్రమాలతో పాటుగా ఒంగోలు నగరంతోపాటు జిల్లాలో ఆన్ని గ్రామాలలో ఉన్న స్వాతంత్ర్య సమర యోధుల విగ్రహాలను ఆధునీకరించి పరిసరాలను శుభ్రపరచి ఆ త్యాగధనుల స్ఫూర్తిని గుర్తు చేసుకోవాలని పర్యావరణ పరిరక్షణ సంస్థ చైర్మన్ జి. వీర భద్రా చారి జిల్లా కలెక్టర్ ను కోరారు. మంగళ వారం సంస్థ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం చేపట్టిన ఇంటింటా జాతీయ జెండా కార్యక్రమం తోపాటు మహనీయుల విగ్రహముల పట్ల కూడా శ్రద్ద వహించాలని, ఆవిధంగా ఆన్ని శాఖలను ఆదేశించాలని వీర భద్రా చారి డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలు ద్వారా,ఇదే మనం వారికి ఇచ్చే గౌరవం, ఘనమైన నివాళి అవుతుందని అన్నారు.మునిసిపల్,పంచాయితీరాజ్ శాఖలను అప్రమత్తం చేసి తద్వారా విగ్రహ లను ఆధునీకరించాలని కలెక్టరు ను కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img