Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన
మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్

విశాలాంధ్ర – కనిగిరి : కనిగిరి పవిత్ర ఫంక్షన్ హాల్ నందు గృహ నిర్మాణ మరియు భవన నిర్మాణ సమీక్ష సమావేశానికి హాజరైన ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ను శుక్రవారం కనిగిరి మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ మర్యాద పూర్వకంగా కలసి వినతి పత్రం అందజేశారు. కనిగిరి బైపాస్ రోడ్డు పూర్తికానందున పట్టణంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం ఎక్కువగా ఉందని గతంలో కూడా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశామని, బైపాస్ రోడ్డు ను త్వరితగతిన పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యలను తీర్చాలని, కనిగిరి నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ హాస్పటల్ ప్రహరీ గోడ చుట్టూ చిన్న చిన్న వ్యాపారస్తులు వ్యాపారం వల్ల ట్రాఫిక్ ఇబ్బందిగా ఉన్నందువలన ఆసుపత్రి కాంపౌండ్ గోడ నుండి పది అడుగుల లోపలికి షాపులు నిర్మించి చిరు వ్యాపారస్తులకు అద్దెకు ఇచ్చినచో చిరు వ్యాపారుల యొక్క వ్యాపారం ఇబ్బంది లేకుండా అలాగే ప్రభుత్వం నకు అద్దె రూపంలో వ్యయం చెల్లిస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని అన్నారు. కనుక విషయమును విన్న ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెంటనే షాపింగ్ కాంప్లెక్స్ ప్రతిపాదనకు పంపి అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, ఒంగోలు బస్టాండ్ నందు గల షాది ఖానా ఎదురు ఉన్న గ్రామ చావడి స్థలమును మున్సిపల్ కార్యాలయం భవనముకు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కోరగా కలెక్టర్ దినేష్ కుమార్ స్పందించి వెంటనే చర్యలు చేపడతామన్నారు. ఈయనతో పాటు ఎంపీపీ దంతులూరి ప్రకాశం ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img