Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

టిడిపి బృందం గుండ్లకమ్మ జలాశయం సందర్శన

విశాలాంధ్ర -మద్దిపాడు : మండల పరిధిలోని గుండ్లకమ్మ జలాశయాన్ని టిడిపి బృందం సోమవారం నాడు సందర్శించడం జరిగింది. మండల పరిధిలోని గుండ్లకమ్మ ప్రాజెక్టులో గత నెల 31 వ తేదీన వరకు 3.40టీఎంసీల నీరు ఉంది ఆ రోజు రాత్రి మూడో గేటు కొట్టుకుపోవటంతో భారీగా నీరు సముద్రం పాలయిన విషయం విదితమే. బృందం సభ్యులైనటువంటి పర్చూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం ఇన్చార్జి నూకసాని బాలాజీ , సంతనూతలపాడు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి బి.యన్ విజయ్ కుమార్, దామచర్ల సత్య, కొండేపి నియోజకవర్గ ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి, ఎర్రగొండపాలెం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి గూడూరు ఎరిక్సన్ బాబు, కందుకూరు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు, మార్కాపూర్ టిడిపి నియోజకవర్గ కందుల నారాయణ రెడ్డి, కనిగిరి టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తదితరులు బృందం టీమ్స్ గా ఏర్పడి ప్రాజెక్టు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. .అనంతరం ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో కొండేపి ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ గుండ్లకమ్మ ప్రాజెక్టు మూడో నెంబర్ గేటు తుప్పుబట్టి నీరు సముద్రం పాలు కావటం అవగాహన లేని ముఖ్యమంత్రితో తాగునీటి నీటిపారుదల విషయం పై నిర్లక్ష్యం ఉందని ఒప్పుకోవాలన్నారు. ముఖ్యమంత్రి సిగ్గు మాలిన పరిపాలన అందిస్తున్నారని ఆయన అన్నారు.వైఎస్ జగన్మోహన్రెడ్డి అనుభవమూ లేని అటువంటి వ్యక్తిని ప్రజలు గమనించాలని ఆయన కోరడమైనది . రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు నోరు వేసుకొని ప్రతిపక్షాలను,మీడియా వారిని తిట్టడం తప్ప తనయొక్క శాఖపై పట్టు లేకపోవడం,తమ శాఖ నుంచి అందవలసిన మరమ్మతుల నిమిత్తం నిధులను కూడా సక్రమంగా అందించి లేనటువంటి మంత్రి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్న చందంగా ఉందని ఆయన అన్నారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు మాట్లాడుతూ ప్రాజెక్టు నీరు సముద్రం పాలు కావడం చాలా బాధాకరమని అన్నారు.ఈ విషయాన్ని రాబోయే రోజుల్లో అసెంబ్లీలో పెట్టి ఈ యొక్క విషయంపై గట్టిగా పోరాడుతామన్నారు. 80 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సిన ప్రాజెక్టు ఒక ఎకరాలు కూడా సాగునీరు అందించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది అని అన్నారు 98 లక్షలు రూపాయలు నిధులు ఇచ్చామని చెప్పుకుంటున్నారని ప్రాజెక్టుకు మూడు కోట్ల రూపాయలు గేట్లకు అవసరం ఉందని చెప్పినారు. నాగార్జునసాగర్ కుడికాలు నుంచి నీళ్లు ఇస్తామని ప్రగల్ బాలు పలికారని గుంటూరు ప్రజలు ఎట్లా ఒప్పుకుంటారని ప్రశ్నించారు చంద్రబాబుని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మూడు సంవత్సరాలు దాటిన పని చేయలేని ప్రభుత్వం బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మండవ జైహింద్ బాబు ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం , రైతు నాయకులు రావి ఉమామహేశ్వరరావు,మార్నేని సుబ్బారావు, రెబ్బ వరపు ప్రభాకర్ ,టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img