Saturday, December 3, 2022
Saturday, December 3, 2022

లారీ కిందకు దూసుకెళ్ళిన కారు

లారీ వెనుక భాగంలోకి చొచ్చుకొని వెళ్ళిన కారు
యువకుడికి తీవ్రగాయాలు

విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : అతి వేగంతో కారు నడుపుతున్న యువకుడు వేగాన్ని అదుపు చేయలేక ముందు వెళ్తున్న లారీ కిందకు దూసుకెళ్ళడంతో యువకుడికి తీవ్రగాయాలైన ఘటన శనివారం సాయంత్రం ఉప్పుగుండూరు నాగులుప్పలపాడు మధ్య 216 జాతీయ రహదారిపై చోటు చేసుకుంది . ఎస్సై వై.వి. రమణయ్య తెలిపిన సమాచారం మేరకు చినగంజాం కు చెందిన సురేష్ కుమార్ రెడ్డి అనే యువకుడు తన కారులో ఒంగోలు నుండి చీరాల కు తన కారులో వేగంగా వెళ్తున్న క్రమంలో మూల మలుపు వద్ద కారు వేగాన్ని అదుపు చేయలేక ముందు వెళ్తున్న సిమెంట్ లారీ కిందకు దూసుకెళ్ళాడు . ఈ ఘటనలో యువకుడికి కాలు పూర్తిగా విరిగిపోవడంతో పాటు ముఖం మీద తీవ్రగాయాలు కావడంతో అతనిని 108 వాహనంలో ఒంగోలు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు . ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమణయ్య తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img