Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పోరాటాలు మరింత ఉధృతం చేయాలి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను గద్దెదించాలి
పార్టీ కార్యకర్తలు ప్రజలకు అండగా నిలవాలి

విశాలాంధ్ర బల్లికురవ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ పోరాటాలను మరింత ఉధృతం చేయాలని ప్రజలకు అండగా నిలవాలని,ఓట్లు పేదలవి సీట్లు కోటీశ్వరులవి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మరియు ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడు రావుల.వెంకయ్య తీవ్ర స్థాయిలో విమర్శించారు. గురువారం కొనిదెన గ్రామంలో బల్లికురవ మండలం సిపిఐ శాఖ 6వ మహాసభ సిపిఐ మండల కార్యదర్శి వల్లపు.నరసింహం అధ్యక్షతన నిర్వహించారు.ఈ సభకు వెంకయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ స్వతంత్రం కోసం కమ్యూనిస్టులు అనేక పోరాటాలు చేసి ప్రాణ త్యాగానికి కూడా వెనకాడా లేదని కానీ బిజెపి ఏ ఒక్క నాయకుడైన స్వాతంత్రం కోసం పోరాటాలు చేశారా అని ప్రశ్నించారు.రైతులు,రైతు కూలీలు, కార్మికులు,బడుగు బలహీన వర్గాల వారు కోట్లాది మంది ఒకవైపు ఉంటే,అదాని, అంబానీ లాంటి వేళ్ల మీద లెక్కించదగ్గ కోటీశ్వరులు మరొకవైపు ఉన్నారని,దేశాన్ని పాలించే పాలకులు కోటీశ్వరుల కొమ్ము కాస్తూ,కోట్లాది మంది ప్రజల పేద ప్రజల కడుపు కొడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారం చేపట్టి ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అని,అధికారం చేపట్టక ముందు అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు,ఒక్క ఏడాదైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇతర దేశాలలోని నల్ల డబ్బు ను రప్పించి పాత నోట్ల రద్దు అనంతరం ఒక్కొక్కరి ఖాతాల్లో 15 లక్షలు నగదు జమ చేస్తాను అన్నారని,ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా ఒక్కరి ఖాతాలో నైనా వేశారా అన్నారు.హామీలు అమలు చేయకపోగా,జిఎస్టి పేరుతో పన్ను పోటు విధించటం ద్వారా దేశంలో అన్ని రకాల ఉత్పత్తుల మీద అధిక ధరలు వెచ్చించి పేద ప్రజలతో సహా పొన్ను బాదుడు బాదుతున్నారు అన్నారు.పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు ఆకాశం అందుతున్నాయి అన్నారు. కరోనా కష్టకాలంలో కూడా కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉన్న వివిధ దేశాల్లో,రాష్ట్రాల్లో అందించిన వైద్య సేవలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచాయి అన్నారు.ప్రస్తుత దేశ ఆర్థిక రాజకీయ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రభుత్వ రంగా సంస్థలన్నీటిని కేంద్ర ప్రభుత్వం కార్పొరేటు శక్తులకు కట్టబెడుతుందని ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కును ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాన్ని అందరం కలిసికట్టుగా అడ్డుకోవాలని అన్నారు.నరేంద్ర మోడీ దేశంలో వారికి అనుగుణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించకపోతే వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్,ఇన్కమ్ టాక్స్ అధికారులు చేత దాడులు చేస్తున్నారన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానం కేవలం పేద ప్రజలను దోచుకోవడమే అన్నారు.ఈ విధమైన ప్రజాకంటక పాలనకు చరమగీతం పాడకపోతే ప్రజల జీవితాలు మరింత దుర్భరంగా మారతాయి అన్నారు.ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వల్లెపు నరసింహమును సిపిఐ సీనియర్ నాయకులు ఉయ్యాల.పరమేష్ మరియు కొనిదెన గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా సహాయ కార్యదర్శి తన్నీరు సింగరకొండ,దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.సుబ్బారావు, బాపట్ల జిల్లా కార్యవర్గ సభ్యులు జేబీ.శ్రీధర్, ఏఐఎస్ఎఫ్ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు పి.నాగేంద్రబాబు,మండల సహాయ కార్యదర్శి జి.వెంకటప్పయ్య,ఏఐటియుసి జిల్లా కార్యవర్గ సభ్యులు నిమ్మల.అప్పయ్య,అట్లూరి శ్రీనివాసరావు,ఉయ్యాల.బాబు,నాగబోయిన.శివయ్య తదితరులు పాల్గొన్నారు.

నరసింహ సన్మానిస్తున్న దృశ్యం
సమావేశంలో మాట్లాడుతున్న నరసింహ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img