Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

గడపగడపకు ప్రభుత్వం చారిత్రాత్మకం

ఉప ముఖ్యమంత్రి,పీడిక రాజన్న దొర

విశాలాంధ్ర : పామూరు గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టడం చారిత్రాత్మకమని ఉపముఖ్యమంత్రి గిరిజన సంక్షేమ శాఖ మాత్యులు పీడిక రాజన్న దొర అన్నారు. మంగళవారం గిరిజన స్వాతంత్ర సమరయోధులు హనుమంతప్ప పెద్ద బయన్నలు మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాలు ముగించుకొని మంగళవారం రాత్రి శ్రీశైలం నుండి విజయనగరం వెళ్తూ పామూరు పట్టణంలో ఆప్తమిత్రుడైన పారిశ్రామికవేత్త సిద్ధమూర్తి నారాయణరెడ్డి ఆహ్వానం మేరకు విందుకు హాజరయ్యారు. ఆయనకు సిద్ధ మూర్తి నారాయణరెడ్డి తో పాటు మాజీ వైస్ ఎంపీపీ పువ్వాడి రాంబాబు, కల్లూరి రామిరెడ్డి, బోయళ్ళ నారాయణరెడ్డి, అంబటి కొండారెడ్డి లు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి వాలంటీర్స్ ను నియమించి సంక్షేమ పథకాలను నేరుగా ఇంటికి చేరవేస్తున్న వైసిపి ప్రభుత్వంనికే దక్కిందన్నారు. .ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో వివరించి ప్రజలను మెప్పించి, ఒప్పించి 2024 ఎన్నికల్లో 175 స్థానాలను గెలుచుకోవడం జగన్మోహన్ రెడ్డి ఆలోచనల ప్రకారం సాధ్యమేనన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామస్థాయి నుండి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img