Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గ్రామీణ ఉపాధిని మెరుగు పరచటమే ప్రధాన లక్ష్యం

టెక్ బుల్స్ చైర్మన్ భాస్కర్ రెడ్డి

విశాలాంధ్ర- మద్దిపాడు:గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పిస్తూ వారి ఉపాధిని మెరుగు పరచటమే ప్రధాన లక్ష్యంగా టెక్స్బుక్స్ పనిచేస్తుందని చైర్మన్ భాస్కర్రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని గుండ్లాపల్లి పారిశ్రామికవాడ నందు గత నాలుగు నెలల కిందట ఏర్పాటుచేసిన టెక్ బుల్స్ సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది.బుధవారం నాడు టెక్ బుల్స్ కంపెనీ ఆవరణలో చైర్మన్ భాస్కర్రెడ్డి పత్రికా విలేకర్ల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్ పూర్తి చేసినట్టు వంటివారు అమెరికాను, ఆస్ట్రేలియాను, తదితర దేశాలకు గత కొన్ని సంవత్సరాల క్రిందట భారతదేశాని విడి వెళ్లేవారని, ఆ తర్వాత కాలక్రమంలో దేశంలోనే బెంగుళూరు,చెన్నై హైదరాబాద్ తదితర మెట్రో సిటీల న౦దు సాఫ్ట్వేర్ కంపెనీలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన అన్నారు.ఈ క్రమంలో మన ప్రాంతం నందు ఇంజినీరింగ్ పూర్తిచేసిన అటువంటి వాళ్లు తమ కుటుంబాలను ప్రాంతాలను వీడి ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగం చేసుకుంటూ వలన కుటుంబ సభ్యులకు ప్రస్తుతం ఉన్నటువంటి గ్రామీణ వాతావరణానికి దూరం అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు.దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంతాలలోని సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో మొదటిగా ప్రకాశం జిల్లాలోని కొత్తపట్నం సమీపంలో టెక్ బుల్స్ కంపెనీని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మొదలు పెట్టడం జరిగింది అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల వారికి కూడా మెరుగైనటువంటి ఉపాధి కల్పించాలనే క్రమంలో ముందుకు రావడం ఆ తర్వాత ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి సహకారంతో మద్దిపాడుమండలంలోని గుండ్లపల్లి గ్రోత్సెంటర్ నందు ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు.ఐదు వందల మందికి ఉపాధి కనిపించే సామర్థ్యం కలిగినటువంటి బ్రాంచ్ను ఏర్పాటు చేసిన తర్వాత మొదటి బ్యాచ్గా 100మందిని తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.రాబోవు కాలంలోతిరుపతి, విశాఖపట్నం,అనంతపురం తదితర ప్రాంతాల న౦దుకూడా టెక్ బుల్స్ బ్రాంచ్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.టెక్ బుల్స్ డైరక్టర్ సుధాకర రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ పూర్తిచేసిన వారు ఆర్థిక వనరులు సమకూర్చుకునే క్రమంలో ప్రాంతాలను వీడి మెట్రో సిటీల నందం చాలీచాలని జీతాలతో ఇబ్బందిపడుతున్న అటువంటి పరిస్థితులను గతంలో గమనించినట్లు తెలిపారు.ఆ క్రమంలో కరోనా పరిస్థితులు ఏర్పడటం వర్క్ ఫ్రమ్ హోమ్ నినాదంతో అనేక మంది గ్రామీణ ఇంజినీరింగ్ వ్యక్తులు తమ ఉద్యోగాలను కోల్పోయిన పరిస్థితి,ఏర్పడిందన్నారు ఏర్పడింది అన్నారు. .చుట్టుపక్కల గ్రామాల్లోని ఇంజినీరింగ్ పూర్తి చేసినట్టు వంటి వారికి మూడు నెలలపాటు ఉచిత భోజనం, ఉచిత వసతి, ఉచిత శిక్షణ ఇచ్చి, ఉత్తీర్ణత సాధించినట్టు వంటివారికి ఇక్కడే ఉపాధి కల్పించే క్రమంలో టెక్ బుల్స్ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోనే వ్యక్తులు తమ కుటుంబాన్ని పరిసరాలను వదిలిపెట్టకుండా స్థానిక గ్రామ పరిధిలోనే ఉద్యోగావకాశాలు కల్పించుకొని ఆర్థిక వనరులు తక్కువ టైంలోనే సాధించేందుకు అవకాశం ఉంటుందని ఆయన అన్నారు.కార్యక్రమంలో కంపెనీ డైరెక్టర్స, హెచ్ఆర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img