Friday, December 2, 2022
Friday, December 2, 2022

రిమ్స్ ను ఆకస్మిక తనిఖీ చేసిన మేయర్

విశాలాంధ్ర – ఒంగోలు : రిమ్స్ వైద్యశాలలో మేయర్ గంగాడ సుజాత ఆకస్మిక తనిఖీ
నిర్వహించారు. పేషెంట్లకు అందుతున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు. ఇంటెన్సీ కేర్ వార్డులో పేషంట్లతో మాట్లాడారు అందుతున్న వైద్య సేవలు గురించి అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు అందుబాటులో ఉన్నారా లేరా. టైం కు మందులు వేస్తున్నారా లేదా వివరాలపై పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యశాలలను ఆధునికరించడమే కాకుండా. మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పూర్తిస్థాయిలో వైద్య సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. డాక్టర్లను అడిగి పేషెంట్ల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకున్నారు. వైద్య సేవలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని డాక్టర్లను ఆదేశించారు. వార్డులో పారిశుద్ధ పనులు క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు. డాక్టర్లు 24 గంటలు పేషెంట్లకు అందుబాటులో ఉండాలన్నారు. మేయర్ తోపాటు డాక్టర్లు జెస్సి. హవీలా తోపాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img