Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆర్టీసిఉద్యోగులకు కొత్తవేతనాలు వెంటనే అమలుచేయాలి

. ఆర్టీసి(పిటిడి)ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్రప్రధానకార్యదర్శి పలిశెట్టి దామోదరరావు డిమాండ్
. సమావేశానికి హాజరైన ఆర్టీసి ఇ యూ నాయకులు

విశాలాంధ్ర – ఒంగోలు : ఏపి పిటిడి(ఆర్టీసి)ఉద్యోగులకు ప్రభుత్వఉద్యోగులమాదిరిగా అమలు జరగాల్సిన 11 వ వేతనసవరణ జీతాలు ప్రభుత్వం ఇచ్చిన జిఓలు 113/114 ల మేరకు ఆర్టీసి ఉద్యోగులకు వెంటనే కొత్తవేతానాలు అమలు జరిగేలా సంబందిత అధికారులు చొరవ తీసుకొనేలా ముఖ్యమంత్రి.వై.యస్.జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలని ఏపి పిటిడి(ఆర్టీసి)ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్రప్రధానకార్యదర్శి పలిశెట్టి దామోదరరావు డిమాండ్ చెేసారు. గురువారం ఒంగోలు ఆర్టిసీ ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో జరిగిన ఒంగోలు జిల్లా ఆర్టీసి ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కౌన్సిల్ సమావేశం ఆర్టీసి ఇ.యు జిల్లా అధ్యక్షులు యస్. పోలయ్య అధ్యక్షతన జరిగింది.
ఈసమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతు ప్రభుత్వఉద్యోగులకు 11 వ వేతన సవరణ జీతాలు ఈఏడాది జనవరి నుండి అమలు జరిగినాసరే ఆర్టీసి ఉద్యోగులకు ఇంకా 11వ వేతన సవరణ జీతాలు అమలు చేయకపోవడం చాలా బాదాకరమని,ఆర్టీసి ఉద్యోగులు కొత్తజీతాలు అమలు కోసం ఉద్యమబాటపట్టకముందే అశుతోష్ మిశ్రానివేదికప్రకారం వేతనాలు అమలు జరిగేలా ముఖ్యమంత్రి చొరవ తీసుకొని 52 వేలమంది ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం చేయాలని దామోదరరావు విజ్ఞప్తి చేసారు.అలాగే ఈసమావేశంలో పాల్గొన్న రాష్ట్రకార్యదర్శి కె.నాగేశ్వరరావు,సహాయకార్యదర్శి సి.హెచ్. స్వారూపారాణి మాట్లాడుతూ ఆర్టీసి ఉద్యోగులకు పాత పద్దతిలోనే వైధ్యసౌకర్యాలు ఇవ్వాలని,ఎస్ పి బి స్/ ఎస్ బి టి బకాయిలు ఒకే సారి అందరికీ చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని అన్నారు.ఈసమావేశంలో పాల్గొన్న నెల్లూరు జోన్ జోనల్ అధ్యక్షలు వాకా రమేష్,జోనల్ కార్యదర్శి డి. బాబూసామ్యుల్ మాట్లాడుతూ 2017 వేతనాల సవరణ అరియర్సు మరియు పెండింగుఉన్న లీవ్ ఎన్ క్యాస్ మెంటు కూడా చెల్లించెేలా చర్యలు తీసుకోవాలి.వర్కుషఫ్/టిఆర్ ఎస్ ఉద్యోగులకు ఇన్సెంటువ్ రాకుండాచేసేలా ఇచ్చేసర్క్యులర్ ను రద్దుచేయాలని,పాతనారమ్స్ ప్రకారం అన్నికేటగిరుల ఉద్యోగులకు ప్రోమోషన్సు ఇవ్వాలని,కాలం చెల్లిన టిమ్సు స్దానంలో కొత్తవికొనుగోలుచేయాలని,మరియు కండక్టర్లకు కొత్తక్యాష్ బ్యాగులు సప్లయిచేయాలని,కాలం చెల్లిన బస్సులు స్దానం కొత్తబస్సులు ఇవ్వాలని,అన్ని కేటగిరులలో పెండింగుఉన్న ఖాళీలు వెంటనే బర్తిచేయాలని డిమాండ్ చేసారు.అలాగే మేనేజ్ అవసరంగా సమస్యలు సృష్టిస్తున్న వైఖరి మానుకోవాలని అన్నారు.ఈసమావేశంలో ఇ.యు జోనల్ నాయకులు బెజవాడ రవి, పి.చక్రపాణి,మరియు బాపట్ల జిల్లా ఇ.యు అధ్యక్షులు పసుపులేటి చిరంజీవి, ఒంగోలు జిల్లా ఆర్టీసి ఇ.యు అధ్యక్షులు పోలయ్య,జిల్లాకార్యదర్శి పిడుగు వెంకటేశ్వర్ రెడ్ఢి,రీజనల్ నాయకులు యన్. తిరుమలేషు,ఆర్.వి.జి.రెడ్జి, సి.హెచ్.వి. సుబ్బారావు తో పాటు జిల్లాలో ఉన్న ఐదు డిపోల అధ్యక్ష,కార్యదర్శులు ముఖ్యకార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొన్నారు.ఈసమావేశం ప్రారంబంలో ఎంప్లాయిస్ యూనియన్ కునాలుగుదశాభ్దాలుగా పనిచేసి ఉమ్మడిరాష్ట్రంలో రాష్ట్రఅధ్యక్ష,ప్రధానకార్యదర్శులుగా పనిచేసిన కాఃబి.రామారావు ఈనెల 8 మరణించినందున ఆయనకు ఈజిల్లా కౌన్సిల్ లో సంతాపాన్ని ప్రకటించారు.జిల్లాలో ఉన్న సమస్యలపై డిపిటిఓ మెమోరాండం ఇవ్వాలని తిర్మాణించామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img