విశాలాంధ్ర – నాగులుప్పలపాడు : దేశ రక్షణలో జవాన్ల త్యాగాలు మరువలేనివని ఎంపీపీ నలమలపు అంజమ్మ కృష్ణారెడ్డి అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని డ్వామా ఆధ్వర్యంలో గ్రామపంచాయతీలో నిర్వహిస్తున్న నేలతల్లికి నమస్కారం వీరులకు వందనం వసుదకు వందనం కార్యక్రమంలో భాగంగా శనివారం పోతవరం, కొత్తకోట గ్రామాలలో నిర్వహించిన కార్యక్రమాలలో ఎంపీపీ పాల్గొని వీరుల త్యాగాలకు గుర్తుగా ఏర్పాటు చేసిన స్థూపాలకు హారతి ఇచ్చారు.జాతీయ సమైక్యత కోసం అందరూ పాటుపడాలని ప్రతిజ్ఞ చేయించారు .మొక్కలు నాటారు. రిటైర్డ్ జవాన్లు చిన్నం సురేష్ చిన్నం రమేష్ లను శాలువా కప్పి సన్మానించారు మన దేశం ఎంతో గొప్పదని దేశ సంస్కృతిని చాటి చెప్పాలని ఎంపీపీ దంపతులు సూచించారు. కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి నల్లమలపు కృష్ణారెడ్డి, ఎంపీడీవో జయమణి, ఎంపీటీసీ పొద పవన్ ,సర్పంచులు శీలం రేణుక సురేష్, చిన్నం సుజాత, పోలినేని కోటేశ్వరరావు, ఇమ్మిశెట్టి బాలకృష్ణ ,గండు హరిబాబు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.