Thursday, September 29, 2022
Thursday, September 29, 2022

మానవత్వానికి మించిన దేశభక్తి లేదు!

విశాలాంధ్ర : ఒంగోలు: సాటి మనిషి కష్టాల్లో తనకు చేతనైన సహాయంతో ఆదుకొనే మానవత్వానికి మించిన దేశభక్తి మరొకటి లేదని డాక్టర్ మొగిలి దేవ అన్నారు. సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ప్రకాశం జిల్లాలో ఆపదలో ఉన్న వారికి ‘మేమున్నామంటూ’ చేతికి ఎముకే లేనట్టుగా ఆపన్న హస్తమిస్తూ ఆదుకుంటూ ఉందన్నారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ సహకారంతో.. ట్రస్ట్ చైర్ పర్సన్ షేక్ షహనాజ్, కార్యదర్శి షేక్ సర్దార్ భాష సేవా దృక్పథంతో అన్ని రకాలుగా సేవలను విస్తరించి తమదైన ముద్ర వేయడం అభినందనీయమన్నారు. చవటపాలెం చెందిన తాపీ మేస్త్రి గా పనిచేస్తున్న రాచపూడి నగేష్ బిల్డింగ్ పైనుండి పడి ప్రమాదానికి గురైనారు. పూర్తిగా మంచానికే పరిమితమైన ఇతనికి మంగళవారం ఒంగోలు ట్రస్ట్ కార్యాలయం వద్ద ప్రవాస భారతీయుడు వెంకట రాఘవేంద్రరావు కొల్లి, పేరు చెప్పడానికి ఇష్టపడని మరొక ప్రవాస భారతీయుడి సహకారంతో 20 వేలు వీల్ చైర్, మరియు నిత్యవసర వస్తువులను, ఆర్థిక సహాయాన్ని ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ళ సుబ్బారావు చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా మారెళ్ళ మాట్లాడుతూ.. తాపీ పని చేసే నగేష్ ప్రమాదానికి గురై కనీసం బాత్రూం కి కూడా నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడని, ఈ విషయాన్ని తెలుసుకున్న ట్రస్ట్ కార్యదర్శి సర్దార్ భాష ఇతనికి సహాయమందించడం మానవత్వంతో కూడిన గొప్ప కార్యముగా చెప్పవచ్చన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి షేక్ సర్దార్ భాష,చైర్ పర్సన్ షహనాజ్ తదితరులు పాల్గొన్నారు ..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img