Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఆగని కలప అక్రమ రవాణా

కాసులు కురిపిస్తున్న దందా
నీరు గారి పోతున్న జగనన్న హరితవనం లక్ష్యం
సామిల్ లపై తనిఖీలేవి
నిర్లక్ష్యంగా అధికారులు

విశాలాంధ్ర- కనిగిరిj : ఓవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జగనన్న హరితహారం కార్యక్రమాన్ని చేపడుతుంటే మరోవైపు అక్రమార్కులు యదేచ్చగా చెట్లను నరుకుతూ కలపను అక్రమంగా రవాణా చేస్తున్నారు. మొక్కలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని నినాదం అధికారుల అలసత్వంతో కాకితాలకే పరిమితమైంది. అటవీని రక్షించడంతోపాటు వాతావరణ సమతుల్యాని కాపాడేందుకు ప్రభుత్వం వాల్టా చట్టం రూపొందించింది. చెట్లను నరికి వేయాలంటే అటవీశాఖ, రెవెన్యూ శాఖ సంబంధిత గ్రామపంచాయతీ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. కానీ ఇది ఎక్కడ అమలు కావడం లేదు. దీంతో అక్రమార్కులు ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్లను వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి చెట్లను నరికి వేస్తూ ఇతర ప్రాంతాలకు యదేచ్చగా తరలిస్తున్నారు. వన సంపద సంరక్షణ కోసం తీసుకువచ్చిన వాల్టా చట్టం అధికారులు నిర్లక్ష్యంతో నీరుగారిపోతుంది. కనిగిరి నియోజకవర్గంలో కనిగిరి, వెలిగండ్ల, సిఎస్ పురం, హెచ్ఎం పాడు, పిసీపల్లి, పామూరు మండలాల్లో పచ్చని చెట్లను అక్రమార్కులు నరికి మిల్లులకు మరియు వంట చెరువుగా విక్రయాలకు తరలిస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసిన చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెట్లను నరికే అక్రమార్కులు ఆధునిక యంత్రాలను వినియోగించి మోటారు రం పాలతో వృక్షాలను గుట్టుచప్పుడు కాకుండా నరికి వేస్తూ కనిగిరి పట్టణంలోకి ప్రతిరోజు ట్రాక్టర్ లో వాటిని తరలిస్తున్నారు. చెట్లను నరికేతో పై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమార్కులు ఇస్తారాజ్యంగా వివరిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి కలప అక్రమ రవాణాలను అడ్డుకోట వేయాలని ప్రజలు కోరుతున్నారు. మొక్కలను పెంచడానికి ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయిస్తూ జగనన్న హరితహారం కార్యక్రమాన్ని చేపడుతుంటే మరోవైపు కలప రవాణాదారులు వృక్షాలు నేల కురుస్తున్నారని చెట్లు నరికే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.- కాసుల కురిపిస్తున్న దందా కలప ను తరలించే అక్రమార్కులు కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో అక్రమార్కులు వేప ,తుమ్మ చెట్ల తో పాటు ఇతర చెట్లను సైతం నరికి వేస్తున్నారు. పంట చేలు గుట్టల ప్రాంతాల్లోని చెట్లు రోడ్లకు ఇరువైపులు ఉన్న పెరిగిన వృక్షాలను నేల కురుస్తున్నారు.. కలప వ్యాపారులు తక్కువ ధరకు చెట్లను కొనుగోలు చేస్తున్నారు వాటిని నరికి వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తూ లక్షల గడిస్తున్నారు. చెట్ల నరికివేత పై అధికారుల నియంత్రణ లేకపోవడంతో విచ్చలవిడిగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు .కలపను అధిక ధరలకు విక్రయిస్తూ అందిన కాడికి దండుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారుల స్పందించి కలప అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. -సామిల్ లపై తనిఖీలేవి కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల సామిలపై అధికారుల తనిఖీలు కరువయ్యాయి. కనిగిరి నియోజకవర్గం లోని కనిగిరి, వెలిగండ్ల, సిఎస్పురం ,హనుమంతునిపాడు ,పామూరు ,పిసీ పల్లి మండలాల్లో మండలాల్లో పదుల సంఖ్యలో కలప వ్యాపారం చేసే టింబర్ డిపోలు, వడ్రంగి కార్ఖానాలు ఉన్నప్పటికీ వాటిపై అధికారులు తనిఖీలు చేయకపోవడంపై సర్వత్ర విమర్శలు వినబడుతున్నాయి. అటవీ సమీప ప్రాంతాల్లో, గ్రామాల్లో సంబంధిత శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారే తప్ప కలప వ్యాపారం చేసే సమిల్ లో ఎందుకు తనిఖీలు చేయడం లేదనిది ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కలప దందాను జోరుగా సాగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img