Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నార లోకేష్ కు ఘన స్వాగతం

ఏలూరి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణుల నీరాజనం
నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన నాయకులు కార్యకర్తలు
కావలికి ఏలూరివెంట భారీగా వెళ్ళిన నాయకులు కార్యకర్తలు
ఏలూరి క్యాంప్ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ ఘన నివాళి

లోకేష్ తో పాటు నక్కా ఆనందబాబు, వంగలపూడిఅనిత, కొండయ్య, రాజుల స్వాగతం

విశాలాంధ్ర – మార్టూరు : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నారా లోకేష్ కు బుధవారం ఏలూరి క్యాంప్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం పర్యటనకు వెళ్తున్న యువ నాయకుడు లోకేష్ కు మార్గమధ్యంలో ఏలూరి క్యాంప్ కార్యాలయం వద్ద ఉదయం 11.45 గంటలకు చేరుకోనున్నారు. తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సారధ్యంలో పార్టీ శ్రేణులు వేలాదిమంది ఎదురేగి స్వాగతం పలికారు. నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మంది నాయకులు కార్యకర్తలు తండోపతండాలుగా తరలి రావడంతో ఎమ్మెల్యే ఏలూరి క్యాంప్ కార్యాలయం కిక్కిరిసింది. లోకేష్ రాకతో జాతీయ రహదారి జై చంద్రబాబు జై జై చంద్రబాబు, జై లోకేష్ జై జై లోకేష్ ,జై ఏలూరి, జైజై ఏలూరి నినాదాలతో మారుమ్రోగింది. తొలుత ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు అర్పించారు అనంతరం తెలుగుదేశం పార్టీ పోలీస్ బ్యూరో సభ్యులు నక్కా ఆనందబాబు ,తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత , చీరాల నియోజకవర్గ ఇన్చార్జ్ ఎంఎం కొండయ్య, ఎమ్మెస్ రాజు లతో కలిసి తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి లోకేష్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అక్కడినుంచి ఎమ్మెల్యే ఏలూరి లోకేష్ వెంట వందలాది వాహనాలతో కావలికి బయలుదేరి వెళ్లారు. యువనేత లోకేష్ కు బొల్లాపల్లి టోల్ ప్లాజా, త్రావ గుంట , బైపాస్, టోల్ గేటు, కందుకూరు ప్రధాన రహదారులు అడుగడుగున నియోజవర్గం పలికారు. కావలి నియోజకవర్గం, ముసునూరు గ్రామంలో వైసిపి నేతల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు కరుణాకర్ చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను నారా లోకేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. వైసీపీ నేతల అరాచక కృత్యాలకు దళిత యువకుడు బలహీన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనగా మారిందన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దళితులపై బడుగు బలహీన వర్గాలు మైనారిటీలపై వైసీపీ నేతలు దాడులకు దౌర్జన్యాలకు పాల్పడటం బాధాకరమన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వ పాలనలోనే ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. కుటుంబాలకు అండగా నిలిచేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత లోకేష్ ఆధ్వర్యంలో కావలి బాధితులకు అండగా నిలిచేందుకు వారి కుటుంబానికి ధైర్యం కల్పించేలా లోకేష్ పర్యటన సాగుతుందన్నారు. ప్రజలకు రక్షణ కల్పించాలని విఫలమైన ఈ ప్రభుత్వానికి కావలి ఘటనతోనే వారి పతనానికి నాంది మొదలైందన్నారు. ప్రజలు వైసిపి పాలకులకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఇప్పటికైనా నేతలు తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావత్తమైతే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. ప్రతి కార్యకర్తకు ప్రజలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. పర్చూరు నియోజకవర్గ వ్యాప్తంగా 250 వాహనాలతో కావలి తరలి వెళ్లారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img