Friday, August 19, 2022
Friday, August 19, 2022

జడ్పిటిసి సభ్యుల సంఘ ఉపాధ్యక్షురాలుగా యాదాల రత్నభారతి

విశాలాంధ్ర నాగులుప్పలపాడు :- జిల్లా పరిషత్ పాలకవర్గ సమావేశము మద్దిపాడు ఆవాస్ ఫంక్షన్ హాల్ లో శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సభ్యులకు ఇస్తున్న గౌరవ వేతనం రూ. 25000 లకు పెంచుటకు సభ్యులు తీర్మానించడమైనది. జిల్లా పరిషత్ పాలకవర్గ సభ్యుల పరిపాలన సౌలభ్యం కొరకు ఉత్తర ప్రత్యుత్తరము జరుపుకోవటానికి జిల్లా పరిషత్ కార్యవర్గం అవసరమైన ఉన్నారని భావించి జిల్లా పరిషత్ సభ్యుల పాలకవర్గ ఏర్పాటు జడ్పిటిసి సభ్యులందరూ అనుమతి కోరుతూ తీర్మానించడం జరిగింది. అనంతరం జడ్పిటిసి సభ్యుల సంఘం ఎన్నిక నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలో నాగులుప్పలపాడు జడ్పిటిసి డాక్టర్ యాదాల రత్నభారతి ఉపాధ్యక్షురాలు గా ఎన్నుకోవడం జరిగింది. అనంతరం ఉపాధ్యక్షురాలుగా ఎన్నుకోబడిన యాదాల రత్నభారతిని శాలువాతో కత్తి జడ్పీ చైర్ పర్సన్ వెంకాయమ్మ సన్మానించారు. మండలంలోని వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img