విశాలాంధ్ర- వలేటివారిపాలెం : మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలవలేటివారిపాలెం లో 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కమల్ కుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మండలవిద్యాశాఖ అధికారి మల్లికార్జున హాజరై
మాట్లాడుతూ యోగా భారతదేశంలో పుట్టి పెరిగి నేడు అంతర్జాతీయంగా ఎన్నో దేశాలు అనుసరిస్తున్నాయని అన్నారు మనసు, శరీరం సమ్మితమై ఆరోగ్యకరమైన జీవన విధానానికి యోగా అత్యంత కీలకం అని అన్నారు. యోగా ప్రక్రియ ద్వారా మానసిన ప్రశాంతత చేకూరుతుందని యోగా ద్వారా ఒత్తిడిని అధిగమించడానికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు . ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా అంతర్గత శక్తి, మానసిక ప్రశాంతత, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, యోగాతో అన్ని వయసుల వారికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు.అనంతరం విద్యార్థులచేత యోగా విన్యాసాలు ఆశక్తి గొలిపాయి. ఈ కార్యక్రమంలో వ్యాయామఉపాధ్యాయులు కె. ఐజాక్,యోగా గురువు ఈర్ల అనిల్,