Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైయస్ రాజశేఖర్ రెడ్డి

డాక్టర్ యాదల అశోక్ బాబు ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్

విశాలాంధ్ర – నాగులప్పలపాడు : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వైయస్ రాజశేఖరరెడ్డి అని ఆరోగ్యశ్రీ ప్రత్యేక అధికారి యాదాల అశోక్ బాబు అన్నారు. శనివారం మండలంలోని మట్టిగుంట గ్రామంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీ ప్రత్యేక అధికారి యాదల అశోక్ బాబు, నాగులుప్పలపాడు జడ్పిటిసి సభ్యురాలు యాదల రత్నభారతి లు పాల్గొన్నారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి , సకల జన భాంధువుడు, అపర భగీరథుడు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్ని వర్గాల వారికి రాజకీయ పార్టీలకు అతీతంగా ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలు అందించిన మహానయుడు రాజశేఖర్ రెడ్డి అదే స్ఫూర్తితో నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రికి తగ్గ తనయుడిగా సంక్షేమ పథకాలతో ప్రజల ఇంటి వద్దకే పాలన అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డిదే కావున రానున్న ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిపించి మరలా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టాలని అని అన్నారు. జడ్పిటిసి రత్నభారతి మాట్లాడుతూ రైతన్నలకు పెద్దపెట్టవేసిన ఘనత వైయస్ కుటుంబానికి చెందిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి గ్రామ అధ్యక్షులు సూరిబాబు ,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఇస్తర్ల అంజయ్య , గ్రామ ఉపసర్పంచ్ వెంకాయమ్మ, వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img