విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని టూటౌన్ సీఐ జయ నాయక్ కు ప్రతిష్టాత్మక అవార్డు కైవసం చేసుకున్నారు. వివరాలకు వెళితే పట్టణంలోని టూ టౌన్ సిఐ జయనాయకు తన ప్రతిభతో అంకిత భావంతో అతని కృషికి కేంద్రీయ గృహ మంత్రి దక్షత పధక్ అవార్డు కేంద్రం ద్వారా (సెంట్రల్ గవర్నమెంట్) రావడం జరిగింది. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థల ద్వారా, ప్రజల ద్వారా, టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ద్వారా వారు శుభాకాంక్షలు అందుకున్నారు. ఈ అవార్డు స్పెషల్ ఆపరేషన్ ఇన్విస్టిగేషన్ అండ్ ఫోర్నిసిక్ సైన్స్ విభాగాల్లో ఈ అవార్డు రావడం జరిగింది. భవిష్యత్తులో మరెన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది, అధికారులు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేశారు.
టూ టౌన్ సీఐ జయ నాయక్ కు ప్రతిష్టాత్మక అవార్డు
- Advertisement -
RELATED ARTICLES


