Sunday, July 20, 2025
Homeజాతీయంల్యాండింగ్‌లో సమస్య.. ఇండిగో విమానంలో ప్రయాణికుల హడల్!

ల్యాండింగ్‌లో సమస్య.. ఇండిగో విమానంలో ప్రయాణికుల హడల్!

ముంబయి నుంచి నాగ్‌పుర్‌కు బయలుదేరిన ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో కొన్ని క్షణాలు గందరగోళానికి గురైంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు లోనయ్యారు. ఈ సంఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. ముంబయి నుంచి నాగ్‌పుర్‌కు వచ్చిన ఇండిగో విమానం, నాగ్‌పుర్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్‌కి ప్రయత్నించే సమయంలో రన్‌వే దిశ స్పష్టంగా కనిపించకపోవడంతో పైలట్ అప్రమత్తమై, విమానాన్ని తిరిగి గాల్లోకి తీసుకెళ్లారు. అనంతరం దాదాపు 15 నిమిషాల పాటు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది, దాంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

విజిబిలిటీ తగ్గిపోవడం వల్లే సమస్య
విజిబిలిటీ తగ్గిపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు.
అయినప్పటికీ, పైలట్ రెండో ప్రయత్నంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారు.
ఈ సంఘటన కారణంగా ఇతర విమానాల రాకపోకలపై కూడా ప్రభావం పడినట్లు అధికారులు తెలిపారు. ఇక పుణె, నాగ్‌పుర్ సహా మహారాష్ట్రలోని అనేక జిల్లాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి.
వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం రానున్న రోజులలో అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు