Homeక్రీడలుపీఎస్ఎల్ 12వ సీజన్ తేదీలు ఖరారు.. ఐపీఎల్‌తో మరోసారి ఢీ!

పీఎస్ఎల్ 12వ సీజన్ తేదీలు ఖరారు.. ఐపీఎల్‌తో మరోసారి ఢీ!

- Advertisement -

పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 12వ ఎడిషన్ తేదీలు ఖరారయ్యాయి. వచ్చే ఏడాది మార్చి 18 నుంచి మే 2 వరకు ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా మొత్తం 8 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. లండన్‌లో సెప్టెంబర్ 1న జరిగిన పీఎస్ఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ తేదీలను ఖరారు చేశారు. ఈ భేటీకి 8 ఫ్రాంచైజీల యజమానులు, ప్రతినిధులు హాజరయ్యారు.పీఎస్ఎల్ 11వ సీజన్‌లోనే 8 జట్ల ఫార్మాట్‌ను తొలిసారిగా ప్రవేశపెట్టారు. అలాగే డ్రాఫ్ట్ విధానానికి బదులుగా ఆటగాళ్ల వేలం నిర్వహించారు. మే నెలలో గడాఫీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో హైదరాబాద్ కింగ్స్‌మెన్‌ను ఓడించి, పెషావర్ జల్మీ తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ టైటిల్ గెలుచుకుంది. ఈ మ్యాచ్‌కు 32,461 మంది ప్రేక్షకులు హాజరయ్యారు.తాజా ప్రకటనపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ మోహసిన్ నఖ్వీ స్పందించారు. ఁపీఎస్ఎల్ 11 ఈ లీగ్ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించింది. రికార్డు స్థాయిలో ప్రేక్షకులు, ప్రసారాలతో దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపింది. పీఎస్ఎల్ 12 ఆ స్థాయిని మరింత పెంచుతుంది. మరో అద్భుతమైన సీజన్‌ను అందిస్తాంఁ అని ఓ ప్రకటనలో తెలిపారు.ఈ షెడ్యూల్ ప్రకటనతో ఆటగాళ్ల రిటెన్షన్, ట్రేడ్ విండో, వేలం వంటి కీలక ప్రక్రియలకు మార్గం సుగమమైంది. అయితే, పీఎస్ఎల్ తేదీలు మరోసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) షెడ్యూల్‌తో క్లాష్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ టోర్నీలో హైదరాబాద్ కింగ్స్‌మెన్, ఇస్లామాబాద్ యునైటెడ్, కరాచీ కింగ్స్, లాహోర్ ఖలందర్స్, ముల్తాన్ సుల్తాన్స్, పెషావర్ జల్మీ, క్వెట్టా గ్లాడియేటర్స్, రావల్పిండి జట్లు ఉన్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు