విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : డిజిటల్ యుగంలోనూ పుస్తకాల ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదని రాజాం సీఐ అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం పాలకొండ రోడ్డులో ఏర్పాటు చేసిన విశాలాంధ్ర మొబైల్ బుక్ హౌస్ ను ప్రారంభించారు. అనంతరం స్టాళ్లను సందర్శించి వివిధ రకాల పుస్తకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ నిస్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా ప్రభావం పెరిగినప్పటికీ పుస్తక పఠనానికి ఉన్న విలువను ఏమీ తగ్గించలేవు. పుస్తకాలు మన ఆలోచనలను విస్తరింపజేస్తాయి, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయి, సమాజంపై అవగాహన పెంచుతాయిు అని పేర్కొన్నారు. ఇలాంటి ప్రత్యేక పుస్తక ప్రదర్శనలు పుస్తకాలపై ఆసక్తిని పెంపొందిస్తాయని అన్నారు. నిర్వాహకులు చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయం అని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ.వై.రవికిరణ్, సిపిఐ జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు నీలకంటేశ్వర యాదవ్, శ్రీ విద్యానికేతన్ కరస్పాండెంట్ గట్టి పాపారావు, విజ్ఞాన జ్యోతి విద్యాలయ కరస్పాండెంట్ నడికుప్పల తారకేశ్వరరావు, రాజాం ప్రెస్ క్లబ్ మీడియామిత్రులు పీపుల్స్ విజన్ శర్మ, ఉరిటి జగదీశ్వరరావు, దేవిరెడ్డి రామారావు, గుడిబండ సూర్యనారాయణ, భీంపల్లి తిరుపతి, పాలపర్తి గణేష్, ముతికి కిషోర్, మండా శ్రీధర్,తీగల మోహన్, వడ్డాది రాజేష్, గార మన్మధరావు, కె.ఎస్.మూర్తి తదితరులు పాల్గొన్నారు.


