Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నల్ల వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి

విశాలాంధ్ర`విజయవాడ (గాంధీనగర్‌) : కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు, కార్మిక సంఘాలు డిమాండ్‌ చేశాయి. నల్ల చట్టాలను వెనక్కి తీసుకునేవరకు ఐక్య పోరాటం కొనసాగుతుందన్నారు. కేంద్ర సంయుక్త కిసాన్‌ మోర్చా ఇచ్చిన పిలుపు మేరకు ఈనెల 26న దేశవ్యాప్త నిరసనల్లో భాగంగా విజయవాడలోని ధర్నాచౌక్‌ వద్ద ధర్నాతోపాటు జిల్లాల కలెక్టర్‌ కార్యాలయాలు, మండల కార్యాలయాల వద్ద కూడా ధర్నాలు చేయాలని రైతు,కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ధర్నా అనంతరం రాష్ట్ర గవర్నర్‌, జిల్లాల కలెక్టర్లు, మండల కేంద్రాల్లో తహసీల్దార్‌లకు విజ్ఞాపన పత్రాలు అందచేయాలని పిలుపునిచ్చారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం రైతు,కార్మిక సంఘాల నాయకుల సమావేశంలో రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వర రావు మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలను రద్దు చేయా లని కోరుతూ చేస్తున్న ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవటం బాధాకరమన్నారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని ఏడు నెలలుగా రైతులు ఉద్యమిస్తున్నా కేంద్రం కనీసం పట్టించుకోవట్లేదని ఆవేదవ వ్యక్తం చేశారు. మూడు నల్లచట్టాల రద్దు, రైతు రుణ ఉపశమన చట్టం చేయాలని, విద్యుత్‌ 2020 సంస్కరణల బిల్లు వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పంటలకు స్వామినాథన్‌ కమీషన్‌ సూచించినట్లు చట్టబద్ధ యం. యస్‌.పి ప్రకటించాలని, కార్మికుల హక్కులు హరించే లేబర్‌ కోడ్‌లను ఉపసంహరించుకోవాలన్నారు. కౌలు రైతులకు రక్షణ కల్పించాలని, వ్యవసాయ కార్మికు లకు సంవత్సరానికి 200రోజులు పని, రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలని, లాక్‌డౌన్‌ కాలంలో ప్రతికు టుంబ సభ్యునకు 10కేజీల బియ్యం, రూ.10వేలు ఇవ్వాలని, విశాఖ ఉక్కును ప్రైవేటీకరించే ప్రతిపాదనలు విరమిం చుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతు, కార్మికుల సమస్యల పరిష్కారంతోపాటు రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని తీర్మానాలు చేశామని పేర్కొన్నారు. ఆల్‌ఇండియా కిసాన్‌ సభ జాతీయ ఉపాధ్య క్షులు రావుల వెంకయ్య మాట్లాడుతూ ఈనెల 26వ తేదీ నాటికి రైతు ఉద్యమం ప్రారంభమై ఏడు మాసాలు పూర్తవుతుందన్నారు. అంతేకాకుండా 1975 సంవత్సరం జూన్‌ 26న అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజాస్వా మ్యానికి విరుద్ధంగా ఎమర్జెన్సీని విధించిన రోజు..ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ జాతీయ అధ్యక్షులు స్వామి సహజానంద సరస్వతి వర్థంతి ఒకేరోజునని పేర్కొ న్నారు. ఏఐటీయూసీి రాష్ట్ర అధ్యక్షులు రావుల రవీంద్ర నాథ్‌, ఏపీ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి యం.సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.ప్రసాద్‌ ్‌, జాగృతి రైతుసంఘం రాష్ట్ర నాయకులు యం. ప్రసాద్‌, ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం అధ్యక్షుడు వై.కేశవరావు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యు.ఉమా మహే శ్వరరావు, ఎఐకెయంఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్‌ రెడ్డి, సాగునీటి, వినియోగదారుల సంఘాల సమాఖ్య అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్‌ ఆళ్ళా వెంకట గోపాలకృష్ణారావు ,రైతుసంఘం నాయకులు పి.వి ఆంజనేయులు, యం. యల్లమాందారాలవు క్రాంతికారు రైతు సంఘం నాయ కులు మన్నవ హరిప్రసాద్‌, ఇప్టు రాష్ట్ర నాయకులు పోలారి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు పి.నరసిం హారావు, కిసాన్‌ ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు తోట ఆంజనే యులు, నల్లమడ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు డా.కొల్లా రాజమోహన్‌, రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్య క్షులు సింహాద్రి రaాన్సీ, స్త్రీ విముక్తి రాష్ట్ర నాయకు రాలు డాక్టర్‌ విజయ, సీఐటీయూ రాష్ట్ర నాయకురాలు సుబ్బరావమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img