Homeఆంధ్రప్రదేశ్ఏపీఈఆర్సీ కొత్త చైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి బినోయ్ కుమార్ నియామకం

ఏపీఈఆర్సీ కొత్త చైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి బినోయ్ కుమార్ నియామకం

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్సీ)నూతన చైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి బినోయ్ కుమార్ నియమితులయ్యారు.
ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.ఆయన బాధ్యతలు చేపట్టిన తేదీ నుంచి ఐదేళ్ల పాటు లేదా 70ఏళ్ల వయస్సు వచ్చే వరకు పదవిలో కొనసాగనున్నారు.ఈ రెండింటిలో ఏది ముందుగా పూర్తయితే అప్పటితో ఆయన పదవీకాలం ముగుస్తుంది.బినోయ్ కుమార్‌కు పరిపాలనా రంగంలో విశేష అనుభవం ఉంది.మూడు దశాబ్దాలకు పైగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012-13 మధ్య కాలంలో ముఖ్యమంత్రికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకురావడం,నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి అంశాలపై ఆయనకు మంచి అవగాహన ఉంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు