–వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు
విశాలాంధ్ర – కడియం : పెరుగుతున్న ధరలతో సామాన్యుడి బ్రతుకు భారంగా మారిందని వైసిపి రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు అన్నారు. తోపుడు బండి మీద నిత్యవసర వస్తువులను ప్రదర్శిస్తూ, గత ప్రభుత్వంలో నిత్యవసర వస్తువుల ధరలకు ప్రస్తుత ప్రభుత్వంలో ధరలకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలకు తెలియజేస్తూ, వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసిపి జడ్పిటిసి అభ్యర్థి కొత్తపల్లి శివాజీ, ఎంపీటీసీ అభ్యర్థులు పెంకే రామకృష్ణ, దాసరి చంద్రకళ, గుడాల వీరమణి, శాకా మరియమ్మ తదితరులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ కూటమి పాలనలో సామాన్యుడి జీవనశైలి అతలాకుతలమైందని, పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలతో పేదవాడి బ్రతుకు భారంగా మారిందని విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కుటుంబ సభ్యులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.


