Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజాతీయస్థాయి హాకీ పోటీలకు సత్యసాయి జిల్లాక్రీడాకారులు..

జాతీయస్థాయి హాకీ పోటీలకు సత్యసాయి జిల్లాక్రీడాకారులు..

- Advertisement -

హాకీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షులు సూర్యప్రకాష్

విశాలాంధ్ర ధర్మవరం;హాకీ ఇండియా ఆధ్వర్యంలో అక్టోబర్ 10వ తేదీ నుండి 21వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీ నగరం లో జరుగనున్న 16వ జాతీయస్థాయి సీనియర్ పురుషుల హాకీ పోటీలలో పాల్గొనబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు సత్యసాయి జిల్లా ధర్మవరం కు చెందిన క్రీడాకారులు ప్రశాంత్, నవీన్ కుమార్ , మహమ్మద్ రఫీ, ఎంపికైనట్లు హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ బి. సూర్యప్రకాష్ తెలియజేశారు.అలాగే ఈ జట్టుకు కోచ్ గా సత్యసాయి జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ హాకీ కోచ్ హస్సేన్ వ్యవహరించనున్నట్లు అయన ఒక ప్రకటనలో తెలియజేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు ఈ టోర్నమెంట్ గ్రూప్ లీగ్ మ్యాచ్ లలో 10 వతేదీ గుజరాత్, 12 వ తేది బీహార్ , 13 వ తేదీ రాజస్థాన్ రాష్ట్ర జట్లతో తలపడనుంది అని తెలిపారు.రాష్ట్ర జట్టుకు ఎంపికైన క్రీడాకారులను హాకీ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్,సత్యసాయి జిల్లా జనరల్ సెక్రెటరీ బి. సూర్యప్రకాష్, హాకీ సత్యసాయిజిల్లా అధ్యక్షులు బీ.వీ.శ్రీనివాసులు, గౌరవాధ్యక్షులు బండి వేణుగోపాల్, పల్లెం వేణుగోపాల్,వైస్ ప్రెసిడెంట్ గౌరీ ప్రసాద్, ఉడుముల రామచంద్ర,మహమ్మద్ అస్లాం, ఊకా రాఘవేంద్ర,ట్రెజరర్ అంజన్న,జాయింట్ సెక్రటరీ అరవింద్ గౌడ్,చందు, మారుతీ కుమార్ , డైరెక్టర్లు ఇర్షాద్ , అమునుద్దీన్ ,కిరణ్, ఫిజికల్ డైరెక్టర్లు ఓబిలేసు, రఘునాథ రావు హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలియజేసారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు