Homeజిల్లాలుఅనంతపురంప్రజల గుండెల్లో చోటు సంపాదిస్తున్న శివానంద రెడ్డి.. విజయపథంలో జోరు!

ప్రజల గుండెల్లో చోటు సంపాదిస్తున్న శివానంద రెడ్డి.. విజయపథంలో జోరు!

- Advertisement -

గడపగడపలో ఆత్మీయత.. ప్రజలే తన కుటుంబమంటూ ముందుకు!

ప్రజల కష్టాల్లో తోడుగా.. కన్నీటికి ఓదార్పుగా.. అభివృద్ధికి భరోసాగా!

విశాలాంధ్ర – నార్పల:- మండలంలో ప్రజలతో మమేకమవుతూ, ప్రతి గడపకు ఆప్యాయతను పంచుతూ, ప్రతి మనసుకు చేరువవుతున్న జెడ్పీటీసీ అభ్యర్థి శివానంద రెడ్డి ఎన్నికల ప్రచారంలో విజయపథంలో దూసుకుపోతున్నారు. మండలంలోని ఏ గ్రామానికి వెళ్లినా ప్రజల నుంచి లభిస్తున్న ఆత్మీయ పలకరింపులు, ఆశీర్వాదాలు ఆయన ప్రచారానికి మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి.ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామగ్రామాన పర్యటిస్తున్న శివానంద రెడ్డి ప్రజల సమస్యలను ఓపికగా వింటూ, వారి కష్టాలను తనవిగా భావిస్తూ, ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని భరోసా కల్పిస్తున్నారు. ప్రజల కన్నీటిని తుడిచే నాయకుడిగా, వారి కష్టసుఖాల్లో తోడుగా నిలిచే వ్యక్తిగా ఉండాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటూ, యువతతో ఆత్మీయంగా మెలుగుతూ, మహిళలు, రైతుల సమస్యలను తెలుసుకుంటూ ప్రజలతో ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరుచుకుంటున్నారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా ప్రజల జీవితాల్లో భాగస్వామిగా ఉండాలనే ఆకాంక్షతో ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
ప్రతి పలకరింపులో ఆప్యాయత ప్రతి అడుగులో ప్రజలపై ప్రేమ ప్రతి మాటలో భరోసా! ప్రజల కష్టాలను తెలుసుకుంటూ, వారి ఆశలు, ఆకాంక్షలను అర్థం చేసుకుంటూ సాగుతున్న శివానంద రెడ్డి ప్రచారానికి గ్రామాల్లో మంచి స్పందన లభిస్తోంది.
ప్రజల అభిమానం, పెద్దల ఆశీస్సులు, కార్యకర్తల అండదండలతో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న శివానంద రెడ్డి గ్రామగ్రామాన ప్రచార జోరును కొనసాగిస్తున్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, వారి ఆశలకు అండగా నిలవాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు