Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

అర్జెంటీనాదే ‘కోపా అమెరికా కప్‌’

యోడిజెనీరో: ప్రతిష్ఠాత్మక కోపా అమెరికా కప్‌ ఫుట్‌ బాల్‌ టోర్నీ ఫైనల్లో బ్రెజిల్‌పై అర్జెంటీనా ఘన విజయం సాధించింది. ఆద్యంతం పో టాపోటీగా జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 1-0 గోల్‌ తేడాతో ప్రత్యర్థి బ్రెజిల్‌పై విజయం సాధించింది. ఏంజెల్‌ డీ మారియా సాధించిన గోల్‌ అర్జెంటీనాను విజేతగా నిలబెట్టింది. దీంతో 15వ కోపా టైటిల్‌ను అర్జెంటీనా ముద్దాడిరది. ఇక 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ అర్జెంటీనాకు ఓ మేజర్‌ టోర్ని టైటిల్‌ అందించాడు మెస్సీ. ఇదే మెస్సీకి మొదటి కోపా టైటిల్‌ కూడా. అంతేగాక మెస్సీ కెరీర్‌లోనే ఇదే మొదటి అంతర్జాతీయ టైటిల్‌ కావడం గమనార్హం. దీంతో తన సారథ్యంలో దేశానికి ఓ అంతర్జాతీయ టైటిల్‌ తెచ్చిపెట్టాలనే మెస్సీ కల నెరవేరింది. ఆ దేశానికి చెందిన దిగ్గజ ఆటగాడు మారడోనా నేతృత్వంలో కూడా అర్జెంటీనా కోపా టైటిల్‌ గెలవలేదు. 1937లో తొలిసారి కోపా కప్‌ గెలిచిన అర్జెంటీనా.. చివరిసారిగా 1993లో ఈ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఇప్పుడే ఆ ఫీట్‌ను రిపీట్‌ చేసింది. ఇక ఈ విజయంతో అత్యధిక టైటిళ్లు సాధించిన ఉరుగ్వే సరసన అర్జెంటీనా చేరింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img