Saturday, June 3, 2023
Saturday, June 3, 2023

ఆర్సీబీ జట్టులో ఇద్దరు కొత్త ఆటగాళ్లు

బెంగళూరు: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) ఇద్దరు కొత్త ఆటగాళ్లను తీసుకుంది. తొలి మ్యాచ్‌లో గాయపడిన రిసీ టోప్లే స్థానంలో దక్షిణాఫ్రికా పేసర్‌ వేనె పార్నెల్‌ ను ఎంపిక చేసింది. గాయం కారణంగా సీజన్‌ మొత్తానికి దూరమైన బ్యాటర్‌ రజత్‌ పాటిదార్‌ స్థానంలో కర్నాటక పేసర్‌ వైషక్‌ విజయ్‌ కుమార్‌ ను తీసుకుంటునట్టు ప్రకటించింది. వీళ్లు త్వరలోనే జట్టుతో కలవనున్నారు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన టోప్లే ఫీల్డింగ్‌ చేస్తుండగా గాయపడ్డాడు.
నొప్పితో మైదానం వీడిన అతను టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. గత సీజన్‌లో దుమ్మురేపిన రజత్‌ పాటిదార్‌ (మధ్యప్రదేశ్‌) అషిల్లెస్‌ గాయం నుంచి కోలుకోలేదు. దాంతో డూప్లెసిస్‌ సేన వీళ్ల స్థానంలో ఇద్దరిని తీసుకోవాల్సి వచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img