Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

ఆశల అదితి

గోల్ఫ్‌లో అదరగొడుతూ రెండోస్థానానికి..
నేడు నాలుగో రౌండ్‌
గెలిస్తే పతకం ఖాయం

టోక్యో: ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్ల ప్రదర్శనతో అభిమానులు ఆశ్చర్యంలో మునిగి తేలుతున్నారు. పతకాలు తెస్తారనుకున్నా షూటర్లు, ఆర్చర్లు చేతులెత్తేయగా.. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన భారత పరుషుల, మహిళల హాకీ టీమ్స్‌ సంచలనాలు సృష్టించాయి. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మన్‌ప్రీత్‌ సేన కాంస్యంతో కమాల్‌ చేయగా.. మెడల్‌ గెలవకపోయినా అమ్మాయిలు విశ్వక్రీడల చరిత్రలో తొలిసారి సెమీఫైనల్‌కు చేరారు. తాజాగా ఎవరూ ఊహించని క్రీడలో భారత్‌కు మరో పతకం వచ్చేలా కనిపిస్తోంది. అన్నీ సవ్యంగా సాగితే.. అదృష్టం కలిసొస్తే ఒలింపిక్స్‌ గోల్ఫ్‌లో రజతం లేదా కాంస్యం ఖాయమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత యువ గోల్ఫర్‌ అదితి అశోక్‌ టోక్యోలో అదరగొడుతోంది. 60మంది పోటీపడుతున్న ఈ క్రీడలో మూడో రౌండ్‌ ముగిసే సరికి అదితి రెండో స్థానంలో నిలిచింది. కీలకమైన నాలుగో రౌండ్‌ శనివారం జరగనుంది. ప్రస్తుతం టోక్యో వాతావరణం మారుతోంది. కొన్ని చోట్ల విపరీతంగా ఎండ కాస్తుంటే మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. ఒకవేళ గాలి ఉద్ధృతంగా వీస్తూ.. వర్షం కురిస్తే మూడోరౌండ్‌ వరకే ఫలితాలను లెక్కలోకి తీసుకుం టారు. అలా జరిగితే భారత్‌ గోల్ఫర్‌ అదితికి సిల్వర్‌ మెడల్‌ దక్కినట్లే. ప్రస్తుతం అమెరికా అమ్మాయి కొర్దా నెల్లీ 198 పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. గోల్ఫ్‌లో ఎవరికి తక్కువ స్కోరుంటే వారే విజేతగా ఆవిర్భవిస్తారు. అదితి 201 పాయిం ట్లతో రెండో స్థాన ంలో నిలిచి ంది. తొలిరౌండ్లో 67, రెండో రౌండ్లో 66, మూడో రౌండ్లో 68 పాయింట్లు సాధించింది. ఇక అదితి అశోక్‌ 18 ఏళ్ల వయసులోనే 2016 రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. తద్వారా ఒలింపిక్స్‌ బరిలో దిగిన అతి పిన్న గోల్ఫర్‌గా రికార్డుకెక్కింది. అదితి అశోక్‌ గోల్ఫ్‌ బ్యాక్‌ రౌండ్‌ నుంచి రాలేదు. ఓ రెస్టారెంట్‌ విండో నుంచి ఐదేళ్ల వయసులో తొలిసారి ఈ ఆటను చూసింది. ఆమెకు ఈ ఆట నచ్చడంతో తన తండ్రి ప్రోత్సహించారు. ఏషియన్‌ యూత్‌ గేమ్స్‌(2013), యూత్‌ ఒలింప్‌ గేమ్స్‌(2014), ఏషియన్‌ గేమ్స్‌(2014), 2016 ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత తొలి మహిళ గోల్ఫర్‌ అదితినే కావడం విశేషం. లాలా ఐచా టూర్‌ స్కూల్‌ టైటిల్‌ గెలిచిన అతి చిన్న భారత్‌ గోల్ఫర్‌ కూడా అదితినే. టోక్యో ఒలింపిక్స్‌లో గనుక మెడల్‌ తెస్తే గోల్ఫ్‌ క్రీడలో మెడల్‌ సాధించిన తొలి భారత ప్లేయర్‌గా అదితి చరిత్రకెక్కనుంది.
భజరంగ్‌ కాంస్య పోరు జపాన్‌ వేదికగా సాగుతోన్న టోక్యో ఒలింపిక్స్‌ 15వ రోజు భారత్‌ మరో ఓటమిని చవి చూసింది. సెమీ ఫైనల్స్‌ గండం నుంచి తప్పించు కోలేకపోయింది. భారత స్టార్‌ రెజ్లర్‌ భజరంగ్‌ పునియా ఓడిపో యాడు. అతను కూడా సెమీ ఫైనల్స్‌ గండాన్ని దాట లేకపోయాడు. పసిడి పతకం కోసం సాగించిన పోరులో చివరి వరకూ నిలిచినా.. ఓటమి నుంచి బయట పడలేక పోయాడు. పతకం ఆశలను మాత్రం సజీ వంగా నిలుపు కోగలిగాడు. కాంస్య పతకం కోసం మరో బౌట్‌ను భజ రంగ్‌ పునియా ఎదుర్కొనాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img