అగ్రస్థానంపై కన్నేసిన దిగ్గజ జట్లు
న్యూదిల్లీ: ఐపీఎల్ సీజన్16… రోజురోజుకు ఉత్కంఠగా మారుతోంది. ఇప్పటికే చాలా జట్లు ఆరు మ్యాచ్‌లు ఆడాయి. 28వ మ్యాచ్ ముగిసిన తర్వాత పాయింట్ల పట్టికలో గణనీయమైన మార్పు చోటు చేసుకుంది. పంజాబ్ కింగ్స్‌పై విజయంతో ఆర్సీబీ జట్టు పాయింట్ల పట్టికలో 2 స్థానాలు ఎగబాకింది. మరోవైపు వరుస పరాజయాలతో షాక్‌కు గురైన వార్నర్ జట్టు కూడా ఎట్టకేలకు విజయాల ఖాతా తెరిచింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఏ జట్టు స్థానం ఎక్కడుందో తెలుసుకుందాం…
- రాజస్థాన్ రాయల్స్ (8 పాయింట్లు): 6 మ్యాచ్‌లు ఆడి 4విజయాలు, 2 ఓటములతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. రాజస్థాన్ జట్టు ప్రస్తుత నెట్ రన్ రేట్ G1.043.
` లక్నో సూపర్ జెయింట్స్ (8 పాయింట్లు): 6 మ్యాచ్‌ల్లో 2 ఓటములు, 4 విజయాలు నమోదు చేసి G0.709 నెట్ రన్ రేట్‌తో రెండో స్థానంలో నిలిచింది. - చెన్నై సూపర్ కింగ్స్ (6 పాయింట్లు): మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై జట్టు 5 మ్యాచ్‌ల్లో 2 ఓటములు, 3 విజయాలతో 3వ స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ G0.265.
- గుజరాత్ టైటాన్స్ (6 పాయింట్లు): డిఫెండిరగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఆడిన 5 మ్యాచ్‌ల్లో 2 ఓటములు, 3 విజయాలు నమోదు చేసింది. దీంతో G0.192 నెట్ రన్ రేట్‌తో 4వ స్థానంలో ఉంది.
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (6 పాయింట్లు): ఫాఫ్ డుప్లెసిస్ నేతృత్వంలోని ఆర్సీబీ జట్టు 6 మ్యాచ్‌లు ఆడిరది. ఇందులో 3 మ్యాచ్‌లు గెలిచి 3 మ్యాచ్‌లు ఓడిపోయింది. నెట్ రన్ రేట్ -0.068 సాధించి 5వ స్థానంలో నిలిచింది.
- ముంబై ఇండియన్స్ (6 పాయింట్లు): ఆడిన 5 మ్యాచ్‌ల్లో 3 విజయాలు, 2 ఓటములు నమోదుచేసింది. నెట్ రన్ రేట్ -0.164తో 6వ స్థానంలో నిలిచింది.
- పంజాబ్ కింగ్స్ (6 పాయింట్లు): శిఖర్ ధావన్ నేతృత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు ఆడిన 6 మ్యాచ్‌లలో 3 గెలిచి 3 ఓడిపోయి -0.298 నెట్ రన్ రేట్‌తో 7వ స్థానంలో నిలిచింది.
- కోల్‌కతా నైట్ రైడర్స్ (4 పాయింట్లు): కేకేఆర్ ఆడిన 6 మ్యాచ్‌లలో 4 ఓడిపోయి 2 గెలిచింది. ప్రస్తుతం G0.214 నెట్ రన్ రేట్‌తో 8వ స్థానంలో ఉంది.
- సన్‌రైజర్స్ హైదరాబాద్ (4 పాయింట్లు): సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆడిన 5 మ్యాచ్‌లలో 2 గెలిచి, 3 మ్యాచ్‌లు ఓడిపోయింది. -0.798 నెట్ రన్ రేట్‌తో 9వ స్థానంలో ఉంది.
- దిల్లీ క్యాపిటల్స్ (2 పాయింట్లు): డేవిడ్ వార్నర్ నేతృత్వంలోని ఈ జట్టు ఆడిన 6 మ్యాచ్‌లలో ఒక్కటి మాత్రమే గెలిచింది. నెట్ రన్ రేట్ -1.183తో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.