Saturday, August 13, 2022
Saturday, August 13, 2022

ఈసారి ఒలింపిక్స్‌పై తగ్గిన ఆసక్తి


తాజా సర్వేలో వెల్లడి
నాలుగేళ్లకోసారి జరిగే ఒలింపిక్స్‌పై ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుందని మనకు తెలిసిందే.అయితే ఈసారి ఈ క్రీడలపై పెద్దగా ఎవరూ ఆసక్తి చూపడం లేదని తాజా సర్వేలో వెల్లడైంది. కరోనా మహమ్మారితోపాటు హైప్రొఫైల్‌ అథ్లెట్లు(గోల్ఫ్‌ మాజీ నంబర్‌ వన్‌ ఆడమ్‌ స్కాట్‌, ఫుట్‌బాల్‌ స్టార్‌ నెయ్‌మార్‌, టెన్నిస్‌ స్టార్లు ఫెదరర్‌, నదాల్‌, సెరెనా విలియమ్స్‌ తదితరులు) ఈసారి ఈ క్రీడలకు దూరంగా ఉండటంతో ఆసక్తి తగ్గినట్లు తేలింది. ఇప్సోస్‌ అనే సంస్థ 28 దేశాల్లో సర్వే నిర్వహించింది. కేవలం 46 శాతం మంది మాత్రమే ఒలింపిక్స్‌పై ఆసక్తిగా ఉన్నట్లు సర్వేలో తేలింది.ఈ నెల 23 నుంచి ఒలింపిక్స్‌ ప్రారంభం కానున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img