Monday, September 25, 2023
Monday, September 25, 2023

ఉమేశ్‌ను జట్టు నుంచి తప్పించలేదు: బీసీసీఐ

న్యూదిల్లీ: వెస్టిండీస్‌ టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో భారత వెటరన్‌ ఫాస్ట్‌ బౌలర్లు మహ్మద్‌ షమీ, ఉమేశ్‌ యాదవ్‌కు చోటు దక్కని సంగతి విదితమే. ఐపీఎల్‌ నుంచి బీజీగా గడుపుతున్న మహ్మద్‌ షమీకీ సెలక్టర్లు కావాలనే విండీస్‌ సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చినట్లు సమాచారం. ఈ ఏడాది వరల్డ్‌కప్‌ సమయానికి అతడిని ఫిట్‌నెస్‌గా ఉంచేందుకు సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్లో అంతగా అకట్టుకోపోయిన ఉమేశ్‌ యాదవ్‌ను ఉద్దేశపూర్వకంగానే జట్టు నుంచి తప్పించారని వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను బీసీసీఐ వర్గాలు కొట్టిపారేశాయి. ఉమేశ్‌ను కావాలని తప్పించలేదని, అతడు మోకాలి గాయంతో బాధపడుతున్నాడని అందుకే విండీస్‌ టూర్‌కు పరిగణలోకి తీసుకోలేదని బీసీసీఐ వర్గాలు వెల్లడిరచాయి. ‘‘ఉమేశ్‌ యాదవ్‌ ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. అతడు బెంగుళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో కోలుకుంటున్నాడు. అతడు ఇంకా సెలక్టర్లు దృష్టిలో ఉన్నాడు’’ అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకు భారత్‌ తరపున 57 టెస్టులు ఆడిన ఉమేశ్‌… 170 వికెట్లు పడగొట్టాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img