Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

ఐపీఎల్‌`2022లో పది జట్లు ఖాయం

న్యూదిల్లీ : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2022లో 10 జట్లు ఉంటాయని బీసీసీఐ ట్రెజరర్‌ అరుణ్‌ ధుమాల్‌ తెలిపారు. ఇక యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్‌కు స్టేడియాల్లోకి ప్రేక్షకుల ప్రవేశానికి అనుమతివ్వడంపై ఆ దేశంతో చర్చిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇకపోతే ఎనిమిది జట్లతో లీగ్‌ ఆడటం ఇదే చివరిసారని ఆయన స్పష్టం చేశారు. వచ్చే సీజన్‌ నుంచి 10 జట్లు పోటీలో ఉంటాయని వెల్లడిరచారు. ‘‘ఐపీఎల్‌ రెండో దశకు అభిమానులను అనుమతించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రజలు టీకాలు వేయించుకోవడం వల్ల యూఏఈ ప్రభుత్వం అనుమతి ఇస్తుందనే ఆశిస్తున్నాం. ఏం జరుగుతుందో చూడాలి! ఒకవేళ అనుమతిస్తే అటు ఆటగాళ్లు, ఇటు ప్రజలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వారి భద్రతే అత్యంత ముఖ్యం. మిగతా వ్యవహారమంతా యూఏఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది’’ అని ధుమాల్‌ అన్నారు. యూఏఈలో ఐపీఎల్‌ విజయవంతం అవుతుందని నమ్ముతున్నామన్నారు. ఎనిమిది జట్లతో జరిగే లీగ్‌కు ఇదే చివరి సీజన్‌. వచ్చేసారి 10 జట్లు ఉంటాయన్నారు.2011లో 10 జట్లతో ఐపీఎల్‌ లీగ్‌ నిర్వహించగా, 2012, 13లో తొమ్మిది జట్లు కొనసాగాయి. ఆ తర్వాత మళ్లీ ఎనిమిది జట్లకు పరిమితమైంది. ఈ ఏడాది డిసెంబర్లో ఆటగాళ్ల భారీ వేలం ఉండొచ్చని సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img