Saturday, August 20, 2022
Saturday, August 20, 2022

క్రొయేషియా జోడీకి ‘వింబుల్డన్‌ డబుల్స్‌’ టైటిల్‌

లండన్‌ : వింబుల్డన్‌ పురుషుల డబుల్స్‌ టైటిల్‌ను క్రొయేషియా జోడీ నికోలా మెక్టిక్‌, మేట్‌ పావిక్‌ కైవసం చేసుకున్నారు. ఫైనల్లో మార్సెల్‌ గ్రానోల్లర్స్‌ (స్పెయిన్‌)-హోరాసియో జెబలోస్ల(అర్జెంటీనా) జోడీపై 6-4, 7-6 (5), 2-6, 7-5 స్కోర్‌తో విజయం సాధించారు. వింబుల్డన్‌ టైటిల్‌ నెగ్గిన మొట్ట మొదటి క్రొయేషియా డబుల్స్‌ జోడీగా వీరు రికార్డు సృష్టించారు. 20 ఏళ్ల క్రితం అదే దేశానికి చెందిన గోరాన్‌ ఇవానిసెవిక్‌ వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ గెలుపొందాడు. మెక్టిక్‌-పావిక్‌ జంటకు ఈ సీజన్‌లో ఇది ఎనిమిదో టైటిల్‌ కావడం విశేషం. 2018లో ఆస్ట్రేలియా ఓపెన్‌తో పాటు యూఎస్‌ ఓపెన్‌ను పావిక్‌ వేర్వేరు భాగస్వాములతో కలిసి గెలుపొందాడు. మెక్టిక్‌కు మాత్రం ఇదే తొలి గ్రాండ్‌స్లామ్‌. టోక్యో ఒలింపిక్స్‌లోనూ వీరిద్దరూ జంటగా బరిలోకి దిగనున్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img