Friday, December 1, 2023
Friday, December 1, 2023

చాంపియన్‌ పశ్చిమ గోదావరి

హోరాహోరీగా సాగిన ఫైనల్స్‌లో విశాఖపై గెలుపు
మూడు, నాలుగు స్థానాలలో ప్రకాశం, శ్రీకాకుళం జట్లు

విజయవాడ రూరల్‌ : నున్నలోని వికాస్‌ విద్యాసంస్థల క్రీడా మైదానంలో రెండు రోజులపాటు జరిగిన ఏడవ రాష్ట్రస్థాయి జూనియర్‌ (అండర్‌-19) బాలికల హ్యాండ్‌ బాల్‌ ఛాంపియన్‌ షిప్‌ను పశ్చిమ గోదావరి జిల్లా జట్టు కైవసం చేసుకుంది. ఫైనల్స్‌లో పశ్చిమ గోదావరి జట్టు 17-13 గోల్స్‌ తేడాతో విశాఖపట్నం జట్టుపై ఘన విజయం సాధించింది. రెండు జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ హోరా హోరీగా సాగగా, చివరకు పశ్చిమ గోదావరి జట్టు ఛాంపియన్‌ షిప్‌ను దక్కించుకుంది. కృష్ణాజిల్లా హ్యాండ్‌ బాల్‌ అసోసియేషన్‌ నిర్వహి స్తున్న రాష్ట్రస్థాయి జూనియర్‌ బాలికల హ్యాండ్‌ బాల్‌ టోర్నమెంట్‌ ఆదివారం ముగిసింది. ఫైనల్స్‌ ఆరంభం నుంచి పశ్చిమ గోదావరి, విశాఖ జట్ల క్రీడాకారులు చక్కని క్రీడా ప్రతిభను కనబరిచారు. ఆట ప్రథమార్ధం ముగిసేసరికి విశాఖ జట్టు 8-7 గోల్స్‌ తేడాతో ముందంజలో ఉంది. రెండో అర్థభాగంలో పశ్చిమ గోదావరి జిల్లా క్రీడాకారులు పుంజుకుని వరుసగా గోల్స్‌ సాధిం చారు. అదే సమయంలో గోదావరి క్రీడాకారిణుల గోల్స్‌ కు అడ్డుకట్ట వేయడంలో విశాఖ ప్లేయర్లు వైఫల్యం చెందారు. దీంతో విశాఖ జట్టు రెండోస్థానంలో నిలిచింది. మూడోస్థానం కోసం ప్రకాశం, శ్రీకాకుళం జట్ల మధ్య మ్యాచ్‌ జరగ్గా, 10-6 గోల్స్‌ తేడాతో ప్రకాశం జట్టు మూడోస్థానం సాధించగా, శ్రీక ాకుళం నాలుగోస్థానంలో సరిపెట్టుకుంది. అంతకు ముందు నిర్వహించిన సెమీ ఫైనల్స్‌ లో శ్రీకాకుళంపై పశ్చిమ గోదావరి, ప్రకాశంపై విశాఖ జట్లు గెలుపొంది ఫైనల్స్‌కు చేరాయి.
క్రీడాకారులకు లక్ష్యం ముఖ్యం : కల్పలత
క్రీడాకారులకు లక్ష్యం ముఖ్యమని, దానిని సాధించేందుకు వారు కఠోర సాధన చేయాల్సిన అవసరం ఉందని కృష్ణా, గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ కల్పలత అన్నారు. రాష్ట్రస్థాయి జూనియర్‌ బాలికల హ్యాండ్‌బాల్‌ పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్పలత ముఖ్య అతిధిగా హాజరయ్యారు. విజయవాడ నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, కార్పొరేటర్‌ మలేశ్వరితో కలసి ఆమె హ్యాండ్‌ బాల్‌ చాంపియన్‌ పశ్చిమ గోదావరి, రెండోస్థానం సాధించిన విశాఖ, మూడు, కార్పొరేటర్‌ మల్లేశ్వరితో కలసి ఆమె హాండ్‌బాల్‌ ఛాంపియన్‌ పశ్చిమ గోదావరి, రెండో స్థానం సాధించిన విశాఖ, మూడు, నాలుగు స్థానాలలో ఉన్న ప్రకాశం, శ్రీకాకుళం జట్లకు ట్రోఫీలు, వ్యక్తిగత బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్పలత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చదువుతోపాటు క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. క్రీడలలో రాణించే వారికి విద్య, ఉద్యోగాలలో రెండుశాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ జీవితంలో స్థిరపడేందుకు ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకుని, దానిని చేరుకునేందుకు కష్టపడాలని ఆమె సూచించారు. క్రీడలలో పాల్గొనేం దుకు తల్లిదండ్రులు బాలికలను ప్రోత్సహిం చడంపై కల్పలత హర్షం వ్యక్తం చేశారు. మేయర్‌ రాయన భాగ్యలక్ష్మీ మాట్లాడుతూ, బాలికలు జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో రాణించాలన్నారు. ఈ నెల ఎనిమిది నుంచి లక్నోలో జరగనున్న జాతీయస్థాయి పోటీలలో పాల్గొనే ఏపీ జట్టుకు ఎంపికైన క్రీడాకారులకు ఆమె అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికారసంస్థ (శాప్‌) పరిశీలకుడు, కృష్ణాజిల్లా చీప్‌ కోచ్‌ బీ శ్రీనివాసరావు, వికాస్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ నరెడ్ల సత్యనారాయణరెడ్డి, ఏపీ హ్యాండ్‌ బాల్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి పీ సత్యనారాయణరాజు, కృష్ణాజిల్లా కార్యదర్శి ఎన్‌ వంశీకృష్ణ ప్రసాద్‌, వికాస్‌ బీపీఈడీ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎస్‌ రాజు, అధ్యాపకులు రఘు, రత్నబాబు, ఉదయ్‌ కుమార్‌, వ్యాయామ ఉపాధ్యాయులు సాయి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img