న్యూదిల్లీ: భారత్‌లో త్వరలో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాలో ఆష్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ ఉండి తీరాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ‘వన్డే వరల్డ్ కప్‌లో యజ్వేంద్ర చాహాల్ కచ్చితంగా ఆడాలి. టీమిండియాకి జడేజా ఉన్నాడు. అతనితో పాటు రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ కూడా ఉన్నారు. అయితే రవిబిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్ లాంటి స్పెషలిస్టు స్పిన్నర్లే… పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మ్యాచ్ విన్నర్లుగా ఉంటారు… చాహల్‌ని ఐసీసీ టోర్నమెంట్లలో ఆడిరచకపోవడం చాలా పెద్ద తప్పు. అతన్ని ఆడిరచి ఉంటే ఫలితం వేరేగా ఉండేది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా వంటి జట్లపై స్పిన్నర్లు కీలక పాత్ర పోషించారు… 2011 వన్డే వరల్డ్ కప్‌లో పీయూష్ చావ్లా, హర్భజన్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు’ అని గంగూలీ గుర్తు చేశాడు. చాహల్ టెస్టుల్లో పెద్దగా మెరవనప్పటికి పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వికెట్లు తీయగల సమర్థుడు. కుల్దీప్ యాదవ్‌తో కలిసి స్వదేశంలో ఎన్నో మ్యాచ్‌ల్లో టీమిండియాకు విజయాలు అందించాడు. అయితే ఈ మధ్యన అతన్ని పూర్తిగా పక్కకు పెట్టినట్లుగా అనిపిస్తోంది. సాధారణంగా ఉపఖండపు పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలిస్తాయి. అశ్విన్ లాంటి టాప్‌క్లాస్ స్పిన్నర్ టెస్టుల్లో మాత్రమే ప్రభావం చూపించగలడు. వన్డేలు ఆడినప్పటికి పెద్దగా మెరిసింది లేదు. మరో నాలుగు నెలల్లో భారత్ వేదికగా ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో టీమిండియా స్పిన్ బాధ్యతలు ఎవరు నడిపస్తారనేది ఆసక్తిగా మారింది. చాహల్, కుల్దీప్ యాదవ్‌లతో పాటు అక్షర్ పటేల్ ఉన్నప్పటికి రెగ్యులర్ స్పిన్నర్లు ఇద్దరికి మాత్రమే చోటు దక్కుతుంది.