న్యూదిల్లీ : టీమిండియాకు కొత్త స్పాన్సర్ వచ్చేసింది. ఫాంటసీ స్పోర్ట్స్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ ‘డ్రీమ్ 11’ మరోసారి స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. జెర్సీ మీద ఇక నుంచి డ్రీమ్ 11 లోగోతో భారత ఆటగాళ్లు బరిలోకి దిగుతారు. ఇప్పటివరకు బైజూస్ స్పాన్సర్‌గా ఉండగా, ఇప్పుడు మూడేళ్ల కాలానికి డ్రీమ్ 11కి స్పాన్సరింగ్ బాధ్యతలు అప్పగించినట్లు బీసీసీఐ ప్రకటించింది. వెస్టిండీస్ పర్యటన నుంచి డ్రీమ్ 11 స్పాన్సర్‌షిప్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, డ్రీమ్ స్పోర్ట్స్ సహ యజమాని, సీఈవో హర్ష్ జైన్ వివరాలు వెల్లడిరచారు. ‘‘బీసీసీఐ అధికారిక స్పాన్సర్‌గా డ్రీమ్ 11 మరింత బలోపేతం కావాలి. భారత క్రికెట్ పట్ల నమ్మకం ఉండటంతోనే మరోసారి డ్రీమ్ 11 స్పాన్సర్‌గా ఉండేందుకు ముందుకొచ్చింది. ఈ ఏడాదిలోనే ఐసీసీ వన్డే ప్రపంచ కప్‌ను బీసీసీఐ నిర్వహించనుంది. బీసీసీఐ-డ్రీమ్ 11 భాగస్వామ్యం తప్పకుండా అభిమానులకు చేరువుతుందని భావిస్తున్నా’’ అని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ తెలిపాడు. ‘‘చాలాకాలంపాటు భారత క్రికెట్ జట్టు, బీసీసీఐతో భాగస్వామిగా ఉన్నాం. మళ్లీ స్పాన్సర్‌గా రావడం థ్రిల్లింగ్‌గా ఉంది. కోట్లాది భారత క్రికెట్ అభిమానులకు మా ప్రేమను పంచుతాం. జాతీయ క్రికెట్ జట్టుకు స్పాన్సర్‌గా వ్యవహరించడం గర్వకారణం. భారత క్రీడారంగానికి ఎల్లవేళలా మద్దతుగా ఉంటాం’’ అని డ్రీమ్ స్పోర్ట్స్ సీఈవో హర్ష్ జైన్ వెల్లడిరచారు. ఐపీఎల్ 2020 సీజన్ టైటిల్ స్పాన్సర్‌గా డ్రీమ్ 11 వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జాతీయ జట్టుకు స్పాన్సర్‌గా రావడం గమనార్హం.