Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

టీమిండియా టార్గెట్‌ 276


కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత్‌, శ్రీలంక జట్ల మధ్య రెండో వన్డే జరుగుతోంది.శ్రీలంక టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.50 ఓవర్లలో లంక 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేసింది.అసలంక 65 పరుగులు, అవిష్క ఫెర్నాండో 50 పరుగులు అర్ధ శతాకాలతో రాణించారు. చివరలో కరుణరత్నె చెలరేగిపోయాడు. 44 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ 11పరుగులు ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు. టీమిండియా బౌలర్లలో భువీ, చహల్‌ తలో మూడు వికెట్లు, చాహర్‌ రెండు వికెట్లు పడగొట్టగా ఒకరు రనౌట్‌గా వెనుదిరిగారు. 276 పరుగుల లక్ష్యంతో ఇండియా బ్యాటింగ్‌ ప్రారంభించింది. ఓపెనర్లుగా శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా క్రీజులోకి అడుగుపెట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img