Friday, October 7, 2022
Friday, October 7, 2022

తదుపరి మ్యాచ్‌లో రోహిత్‌ ఆడతాడు : మహేల

దుబాయ్‌ : ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌ ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఆడతాడని ఆ జట్టు కోచ్‌ మహేల జయవర్ధనే స్పష్టం చేశాడు. ఆదివారం సీఎస్‌కే తో జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ ఆడలేదు. రోహిత్‌తో పాటు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య కూడా అందుబాటులో లేరు. ‘యూకే నుంచి తిరిగి వచ్చిన తర్వాత రోహిత్‌ శర్మ సాధన చేస్తూనే ఉన్నాడు. అయినా అతడికి కొన్ని రోజులు విశ్రాంతిని ఇస్తే బాగుంటుందని భావించాం. తర్వాతి మ్యాచ్‌లో రోహిత్‌ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. హార్దిక్‌ పాండ్య ప్రస్తుతం ప్రాక్టీసులో ఉన్నాడు. కాబట్టి అతడికి మరికొన్నాళ్లు విశ్రాంతినివ్వాలని అను కుంటున్నాం’ అని మహేలా జయవర్ధనే తెలిపాడు.
సీఎస్కే శుభారంభం : ఐపీఎల్‌-14 రెండో విడతలోలో ధోనీ సారథ్యంలోని సీఎస్కే శుభారంభం చేసింది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (88 నాటౌట్‌) మెరవడం వల్ల ఆదివారం జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో 20 పరుగుల తేడాతో ముంబై జట్టుపై విజయం సాధించింది. జడేజా(26), డ్వేన్‌ బ్రావో (23) సహకారంతో రుతురాజ్‌ పోరాడడం వల్ల మొదట చెన్నై 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. ఛేదనలో ముంబయి 8 వికెట్లకు 136 పరుగులే చేయగలిగింది. బ్రావో (3/25), దీపక్‌ చాహర్‌ (2/19) కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆ జట్టుకు కళ్లెం వేశారు. సౌరభ్‌ తివారి(50 నాటౌట్‌) పోరాడినా ఫలితం లేకపోయింది.ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌ తమ తర్వాతి మ్యాచ్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో గురువారం ఆడనుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img