Tuesday, December 6, 2022
Tuesday, December 6, 2022

పంజాబ్‌ కింగ్స్‌లోకి నేథన్‌ ఎలిస్‌

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో దశకు జట్లన్నీ సిద్ధ మవు తున్నాయి. ఇప్పటికే సీఎస్‌కే యూఏఈ చేరు కుంది. అయితే కరోనా, ఇతర టోర్నీల కారణం గా అందుబా టులో లేని ఆటగాళ్ల స్థానాలను ఆయా ఫ్రాంచైజీలు ఇతర ఆటగాళ్లతో భర్తీ చేసుకుం టున్నాయి. ఈ నేపథ్యంలోనే పంజాబ్‌ కింగ్స్‌ జట్టు ఆస్ట్రేలియా ఆసీస్‌ యువ ఆటగాడు నేథన్‌ ఎలిస్‌తో ఒప్పందం కుదు ర్చుకుంది. తొలి దశలో పంజాబ్‌ కింగ్స్‌కు జే రిచర్డ్‌సన్‌, రిలే మెరిడీత్‌ ఆడారు. కొన్ని కారణాల వల్ల వారిప్పుడు అందుబాటులో ఉండటం లేదు. దాంతో రిచర్డ్‌సన్‌ స్థానంలో యువ పేసర్‌ నేథన్‌ ఎలిస్‌ను తీసుకుం టున్నట్టు పంజాబ్‌ కింగ్స్‌ తెలిపింది. అయితే మెరిడీత్‌ స్థానంలో ఇంకెవరితోనూ ఒప్పందం కుదుర్చుకోలేదు. ఏడాది కాలంగా ఎలిస్‌ అద్భుతంగా రాణిస్తు న్నాడు. ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్‌ నుంచి మూడు ఫార్మాట్లలో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. బంగ్లాదేశ్‌ సిరీసులో ఆడాడు. ఇక టీ20 ప్రపంచ కప్‌నకు ఎంపిక చేసిన బృందం లోని ముగ్గు రు రిజర్వు ఆటగాళ్లలో అతడూ ఉన్నాడు. తొలి దశలో ఐపీఎల్‌కు దూరమైన జోష్‌ హేజిల్‌ వుడ్‌ రెండో దశలో ఆడనున్నాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img