Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

‘పారా’ ధీరులకు ఘనస్వాగతం

టోక్యో : జపాన్‌లో జరిగిన పారాలింపిక్స్‌లో పాల్గొన్న భారత క్రీడాకారుల చివరి బృందం స్వదేశానికి చేరుకుంది. అందులో షూటింగ్‌ సంచలనం అవని లేఖరా, బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ సుహాస్‌ యతిరాజ్‌ ఉన్నారు. వీరంతా సోమవారం దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సాయ్‌) అధికారులతో పాటు వారి వారి కుటుంబసభ్యులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. స్వదేశం చేరుకున్న పారా-అథ్లెట్లలో బ్యాడ్మింటన్‌, షూటింగ్‌, ఆర్చరీ క్రీడా బృందాలున్నాయి. టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొన్న అథ్లెట్లతో గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. పారాలింపిక్స్‌లో భారత్‌ 19 పతకాలు సాధించి 24వ స్థానంలో నిలవగా, అందులో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్య పతకాలున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img