Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

ప్రపంచ ఆర్చరీ పోటీల్లో భారత్‌కు రెండు రజతాలు

యాంక్టాన్‌ (అమెరికా) : ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత ఆర్చర్లు ఆకట్టుకున్నారు. మరోసారి స్వర్ణాన్ని కోల్పోయినప్పటికీ, రజతాలు చేజిక్కుంచుకున్నారు. యాంక్టాన్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత మహిళల మిక్స్‌డ్‌ టీమ్‌ తలో రజత పతకం అందుకుంది. శనివారం జరిగిన పోటీల్లో త్రుటిలో స్వర్ణాన్ని చేజార్చుకుంది. ఇప్పటికే 10 సార్లు ఈ పోటీల్లో పాల్గొన్న మన జట్టు.. ఎనిమిది సార్లు ఫైనల్‌కు అర్హత సాధించింది. కానీ ఈ ప్రయత్నాలు అన్నింటిలోనూ వెండి పతకంతోనే సరిపెట్టుకుంది. తాజా పోటీలో భారత మహిళా ఆర్చర్లు మిక్స్‌డ్‌ టీమ్‌లో అభిషేక్‌ వర్మ, జ్యోతి సురేఖ.. ఓ పాయింట్‌ ఆధిక్యంతోనే ఫైనల్‌ ప్రారంభించినప్పటికీ, కొలంబియా టీమ్‌ దూకుడుతో వెనకబడిరది. చివరగా నాలుగు(150-154) పాయింట్ల తేడాతో నిలిచింది. ఏడో సీడ్‌లో ఉన్న భారత్‌ మహిళల జట్టు.. జ్యోతి, మస్కన్‌, ప్రియ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ ఐదు పాయింట్ల(224-229) తేడాతో పోటీ పూర్తి చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img