Friday, December 1, 2023
Friday, December 1, 2023

ప్రమోద్‌ భగత్‌కు భారీ నజరానా

భువనేశ్వర్‌ : టోక్యో పారాలిం పిక్స్‌లో స్వర్ణ పతక విజేత షట్లర్‌ ప్రమోద్‌భగత్‌కు ఒడిశా ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. రూ.6 కోట్ల నగదు బహుమతితో పాటు గ్రూప్‌`ఎ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు బుధవారం వెల్లడిరచింది. పారాలింపిక్స్‌లో ఇటీవల జరిగిన ఫైనల్‌లో బ్రిటన్‌ ఆట గాడు డేనియల్‌ బెతెల్‌పై ఘన విజయం సాధించిన ప్రమోద్‌.. ఈ విభాగంలో భారత్‌ తరఫున తొలి స్వర్ణం గెలిచిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు. నాలుగేళ్ల వయసులోనే పోలియో ప్రభావంతో దివ్యాంగుడైన ప్రమోద్‌.. పొరుగింటి వాళ్లు ఆడుతుంటే చూసి క్రీడల వైపు వచ్చాడు. 2006లో తొలిసారి పారా బ్యాడ్మింటన్‌ పోటీల్లో పాల్గొన్న ప్రమోద్‌.. ఇప్పటివరకు దాదాపు 45 అంతర్జాతీయ పతకాలు అందుకున్నారు. ఇందులో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నాలుగు స్వర్ణాలు, 2018 ఆసియా క్రీడల స్వర్ణం కూడా ఉంది. గత కొన్నేళ్లు కోచ్‌గా పనిచేసిన ప్రమోద్‌.. 2019లో దానికి విరామమిచ్చి, పారాలింపిక్స్‌ క్వాలిఫికేషన్‌పై దృష్టి పెట్టాడు. ఆ తర్వాత అర్హత సాధించి, ఏకంగా స్వర్ణపతకం గెలుచుకుని దేశానికి కీర్తి తెచ్చాడు. 2019లో అర్జున, బిజు పట్నాయక్‌ అవార్డులు అందుకున్నాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img