Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

బాడీ బిల్డర్‌ జో లిండ్నర్‌ మృతి

న్యూదిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ బాడీబిల్డర్‌ జో లిండ్నర్‌ అకస్మాత్తుగా మృతిచెందాడు. ఇతడ్ని జోస్తెటిక్స్‌ అని కూడా పిలుస్తారు. 30 ఏళ్ల వయసులో అతను మృతిచెందినట్లు అతని ప్రియురాలు నిచా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. రక్తనాళాలు ఉబ్బడంతో అతను అకస్మాత్తుగా ప్రాణాలు వదిలాడని ఆమె తెలిపింది. నిచా తన ఇన్‌స్టాలో నివాళి అర్పించింది. ప్రపంచంలోనే జో లిండర్న్‌ అద్భుతమైన, అసాధారణమైన వ్యక్తి అని పేర్కొన్నది.
జో లిండర్న్‌ జర్మనీకి చెందిన బాడీబిల్డర్‌. అతను ఫిట్‌నెస్‌ మోడల్‌గా చేశాడు. సోషల్‌ మీడియాలో పాపులర్‌. ఫిట్‌నెస్‌ టిప్స్‌, ట్రిక్కులు ఇవ్వడంలో అతను సుపరిచితుడు. బాడీబిల్డింగ్‌లో ప్రవేశించడానికి ముందు అతను ఓ క్లబ్‌లో బౌన్సర్‌గా చేశాడు. పర్సనల్‌ ట్రైనింగ్‌ యాప్‌ ఏలియన్‌ గెయిన్స్‌కు ఓనర్‌గా ఉన్నాడు. అయితే తాను స్టెరాయిడ్స్‌ వాడినట్లు ఓ య్యూటూబ్‌ వీడియోలో తెలిపాడు. జో లిండర్న్‌ శరీర ఆకృతి మాజీ బాడీ బిల్డర్‌ అర్నాల్డ్‌ ష్కావజనిగర్‌ తరహాలో ఉంటుందని అతని అభిమానులు చెబుతుంటారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img